News December 25, 2025
ప్రభుత్వ వైద్య సేవలను వినియోగించుకోవాలి: కలెక్టర్

పెద్దపల్లి: ప్రభుత్వ ఆసుపత్రిలో అందిస్తున్న దంత వైద్య సేవలను ప్రజలు వినియోగించుకోవాలని కలెక్టర్ కోయ శ్రీ హర్ష కోరారు. దంత సమస్యలతో ఇబ్బంది పడుతున్న కలెక్టర్ గురువారం జిల్లా ఆసుపత్రిలో రూట్ కెనాల్ చికిత్స చేయించుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇప్పుడు దంతాలను కాపాడే సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. జిల్లా ప్రజలు ఆసుపత్రి వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Similar News
News December 26, 2025
ప్రకాశం: పొట్టకూటి కోసం వెళ్లి.. కామారెడ్డిలో ఆత్మహత్య!

పొట్టకూటి కోసం కామారెడ్డికి వెళ్లిన ప్రకాశం జిల్లా వాసి రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన శుక్రవారం జరిగింది. ప్రకాశం జిల్లాకు చెందిన తమ్మిశెట్టి కన్నయ్య (63) కామారెడ్డి రైల్వే స్టేషన్ సమీపంలో దేవగిరి ఎక్స్‌ప్రెస్ కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. 30 ఏళ్లుగా కామారెడ్డిలో కన్నయ్య జీవనం సాగిస్తున్నట్లు సమాచారం.
News December 26, 2025
కలెక్టరేట్లో ప్రత్యేక పీజీఆర్ఎస్: కలెక్టర్

ఎస్సీ, ఎస్టీల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక పీజీఆర్ఎస్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్లా తెలిపారు. ఇందులో భాగంగా కలెక్టరేట్లో శనివారం 10 గంటలకు పీజీఆర్ఎస్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కారం పొందేందుకు ఈ వేదికను వినియోగించుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.
News December 26, 2025
మెదడు దగ్గరి భాగాల్లో కుక్క కరిస్తే డేంజర్!

కుక్క కాటు వేసిన 14 రోజుల తర్వాత రేబిస్ లక్షణాలు కనిపిస్తాయి. లక్షణాలు కనిపిస్తే దాదాపు మరణం ఖాయమని, అందుకే కాటు వేసిన వెంటనే వ్యాక్సిన్లు తీసుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా మెదడుకు దగ్గరగా ఉండే తల, ముఖం, మెడ భాగాల్లో కరిస్తే చాలా డేంజర్ అని, దీనివల్ల రేబిస్ వైరస్ వేగంగా మెదడును చేరుతుందని తెలిపారు. యాంటీ రేబిస్ వ్యాక్సిన్‌లతో పాటు Rabies Immuno-globulin (RIG) కచ్చితంగా తీసుకోవాలంటున్నారు.


