News December 25, 2025

పిన్నెల్లి సోదరులకు జనవరి 7 వరకు రిమాండ్

image

గుండ్లపాడు జంట హత్య కేసులో నిందితులుగా ఉన్న పిన్నెల్లి సోదరులకు జనవరి 7 వరకు రిమాండ్ పొడిగించారు. నెల్లూరు జిల్లా జైలులో ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు వెంకటరామిరెడ్డి లను మాచర్ల జూనియర్ సివిల్ జడ్జి వర్చువల్‌గా విచారించి రిమాండ్‌ను పొడిగించారు. ఈ కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏ6గా, పిన్నెల్లి వెంకటరామిరెడ్డి ఏ7గా ఉన్నారు.

Similar News

News December 30, 2025

92 అంగన్‌వాడీ పోస్టులు.. అప్లై చేశారా?

image

AP: అనంతపురం జిల్లా <>ICDS <<>>ప్రాజెక్ట్‌లో ఖాళీగా ఉన్న 92 అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. టెన్త్ పాసై, వివాహితులైన 21-35ఏళ్ల స్థానిక మహిళలు డిసెంబర్ 31వరకు ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. CDPOలు నిర్వహించే తెలుగు డిక్టేషన్ పాసు కావలెను. అంగన్‌వాడీ కార్యకర్తకు నెలకు గౌరవ వేతనం రూ.11,500, హెల్పర్‌కు రూ.7000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://ananthapuramu.ap.gov.in/

News December 30, 2025

అంటే.. ఏంటి?: Pseudonym

image

కొందరు రచయితలు తమ సొంత పేరుకు బదులు పెన్ నేమ్ (కలం పేరు)తో రచనలు చేస్తారు. అలాంటి పేర్లను రచయితల pseudonym (స్యూడనమ్) అంటారు. ఇది గ్రీకు పదాల (pseudes – అబద్ధం, onuma: పేరు) నుంచి పుట్టింది. గ్రీకులో pseudonymos ఫ్రెంచ్‌లోకి pseudonymeగా మారి ఇంగ్లిష్‌లో Pseudonymగా స్థిరపడింది.
ex: I wrote under the pseudonym of Evelyn Hervey
డైలీ 12pmకు అంటే.. ఏంటి?లో ఓ కొత్త పదం గురించి తెలుసుకుందాం. <<-se>>#AnteEnti<<>>

News December 30, 2025

కవలలకు జన్మనిస్తే తల్లికి గుండె జబ్బుల ముప్పు

image

కవలలకు జన్మనిచ్చే స్త్రీలకు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం రెట్టింపు అవుతుందని యూరోపియన్ హార్ట్ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనంలో వెల్లడైంది. ప్రెగ్నెన్సీలో బీపీ సమస్యలు ఉంటే కవలలు పుట్టిన తర్వాత గుండె జబ్బుల ప్రమాదం మరింత పెరుగుతుందని అధ్యయనం వెల్లడించింది. ఒక సంవత్సరం లోపు గుండె జబ్బుల కారణంగా ఆసుపత్రిలో చేరే అవకాశం ఎక్కువగా ఉందని తేలింది. కాబట్టి మహిళలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది.