News December 25, 2025

త్వరలో కొత్త మెయిల్ ఐడీలు! గూగుల్ కీలక నిర్ణయం

image

త్వరలో జీమెయిల్ యూజర్ ఐడీ మార్చుకునే ఫీచర్‌ను అందుబాటులోకి తెస్తున్నట్టు గూగుల్ వెల్లడించింది. కొత్త యూజర్ ఐడీతోపాటు పాత ఐడీ యాక్టివ్‌గానే ఉంటుందని, ఇన్‌బాక్స్ ఒకటేనని తెలిపింది. పాత ఐడీ మళ్లీ పొందాలంటే 12నెలలు ఆగాల్సిందేనని చెప్పింది. జీమెయిల్ అకౌంట్‌తో లింకైన ఫేస్‌బుక్, ఇన్‌స్టా, వాట్సాప్, ఆధార్ యూజర్లు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించింది. ఈ ఫీచర్‌ దశలవారీగా అమలులోకి వస్తుందని తెలిపింది.

Similar News

News January 8, 2026

107 పోస్టులు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

image

గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ &ఇంజినీర్స్ లిమిటెడ్ (<>GRSE<<>>)లో 107పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి బీఈ, బీటెక్, ఎంబీఏ, సీఏ, సీఎంఏ, LLB, MBBS, పీజీ, పీజీ డిప్లొమా, ICSI, BSc, MCA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: www.grse.in

News January 8, 2026

అంతా తానై ఉన్నవాడే ‘విష్ణుమూర్తి’

image

ఆవర్తనో నివృత్తాత్మా సంవృతః సంప్రమర్దనః|
అహః సంవర్తకో వహ్నిరనిలో ధరణీధరః||
సమస్త లోకాలకు అధిపతి అయిన విష్ణుమూర్తి సంసార చక్రాన్ని నడిపిస్తూనే, దేనికీ అంటని నిర్లిప్తతతో ఉంటారు. సృష్టి అంతటా తానే నిండి ఉండి, దుష్టశక్తులను అంతం చేస్తారు. సూర్యునిగా వెలుగునిస్తూ, అగ్నిగా హవిస్సును అందుకుంటారు. చివరికి వాయువుగా, ఆదిశేషునిగా ఈ భూమండలాన్ని మోస్తూ సకల చరాచర జగత్తుకు ఆధారుడై ఉన్నారు. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>

News January 8, 2026

టెండర్లు లేకుండా ‘లులూ’కు భూములా?: జగన్

image

AP: 2019-24 మధ్య పారిశ్రామిక వృద్ధిలో రాష్ట్రం నంబర్-1గా ఉండేదని మాజీ సీఎం జగన్ చెప్పారు. ఇప్పుడు చంద్రబాబు బెదిరింపులు తాళలేక, కప్పం కట్టలేక పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారని విమర్శించారు. అదే సమయంలో తనకు ఇష్టమైన కంపెనీలకు పప్పుబెల్లాల్లా భూములు పంచిపెడుతున్నారని మండిపడ్డారు. ‘లులూ కంపెనీ అహ్మదాబాద్‌లో భూములు కొనుక్కుంది. ఏపీలో మాత్రం టెండర్లు లేకుండానే భూములు ఇచ్చేశారు’ అని ఆరోపించారు.