News December 25, 2025
మానవత్వం చాటుకున్న మంత్రి శ్రీధర్ బాబు

ఆపదలో ఉన్న పేద కుటుంబానికి మంత్రి శ్రీధర్ బాబు అండగా నిలిచారు. మల్హర్ మండలం అడువాలపల్లికి చెందిన కొత్తపెల్లి సుమన్ హైదరాబాద్ నిమ్స్‌లో చికిత్స పొందుతూ మరణించారు. భారీ వైద్య ఖర్చులతో ఇబ్బందుల్లో ఉన్న ఆ కుటుంబం దుస్థితిని తెలుసుకున్న మంత్రి.. వెంటనే ఎల్వోసీ మంజూరు చేశారు. ఆసుపత్రికి ఎలాంటి బకాయిలు చెల్లించాల్సిన అవసరం లేకుండా మృతదేహాన్ని అప్పగించేలా చర్యలు తీసుకుని మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు.
Similar News
News January 21, 2026
KMR: ఖాళీ అవుతున్న ‘గులాబీ’ తోట

పదేళ్ల పాటు జిల్లాను శాసించిన బీఆర్ఎస్ ఇప్పుడు ఉనికిని కాపాడుకునే స్థితికి చేరుకుంది. గతంలో చేసిన అభివృద్ధి పనులను బలంగా చెప్పుకొంటున్నప్పటికీ క్షేత్రస్థాయిలో క్యాడర్ చెల్లా చెదురు కావడం ఆ పార్టీని దెబ్బతీస్తోంది. ముఖ్యంగా కీలక నేతలు, మాజీ కౌన్సిలర్లు వరుసగా పార్టీని వీడటంతో జిల్లాలో ‘కారు’ వేగం పూర్తిగా తగ్గిపోయింది. పదేళ్ల పాలనపై ఉన్న వ్యతిరేకతకు తోడు నాయకత్వ లోపం స్పష్టంగా కనిపిస్తోంది.
News January 21, 2026
వంటింటి చిట్కాలు మీకోసం

☛ బెండకాయ కూర చేయడానికి ముందు ముక్కల మీద కాస్త నిమ్మరసం చల్లితే జిగురు ఉండదు.
☛ సాంబార్‌లో ఉప్పు ఎక్కువైతే ఉడికించిన బంగాళదుంప ముక్కలు లేదా శనగ పిండిలో కొద్దిగా నీరు కలిపి దాంట్లో యాడ్ చేయాలి.
☛ పాత్రల్లో నీచు వాసన పోవాలంటే వాటిలో ఉప్పు వేసి కాసేపటి తర్వాత కడిగితే సరిపోతుంది.
☛ పాస్తా ఉడికించినప్పుడు ముద్దలా అవ్వకుండా ఉండాలంటే వాటిని ఉడికించే గిన్నెలో ఓ చెక్క స్పూన్ కానీ ఫోర్క్ కానీ వెయ్యాలి.
News January 21, 2026
MHBD: గురుకుల దరఖాస్తులకు గడువు పెంపు!

సంక్షేమ గురుకులాల్లో ఈ ఏడాది సీట్ల భర్తీకి గడువు పెంచినట్లు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల జిల్లా కోఆర్డినేటర్ జయశ్రీ తెలిపారు. ఇది వరకు ఈ నెల 21 వరకు ఉన్న చివరి తేదీని తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు 25 వరకు పెంచినట్లు ఆమె పేర్కొన్నారు. గత నెల 11న ప్రారంభమైన ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణలో ఇప్పటి వరకు 2 లక్షల 22 వేలకు పైగా దరఖాస్తులు అందాయన్నారు. కాగా, ఫిబ్రవరి 22న ఎంట్రెన్స్ ఎగ్జామ్ ఉండనుంది.


