News December 25, 2025
ఎన్టీఆర్: హైకోర్టు నిర్మాణానికి రాఫ్ట్ ఫౌండేషన్ పనుల ప్రారంభం

రాజధాని అమరావతిలో హైకోర్టు నిర్మాణానికి రాఫ్ట్ ఫౌండేషన్ పనులను మంత్రి నారాయణ గురువారం సాయంత్రం ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా ఆయన పూజలు నిర్వహించారు. 2027కల్లా హైకోర్టు నిర్మాణం పూర్తవుతుందని, B+G+7 అంతస్తుల్లో ఐకానిక్ భవనంగా హైకోర్టు నిర్మిస్తున్నామని మంత్రి చెప్పారు. 45 వేల టన్నుల స్టీల్ వినియోగిస్తూ, 20.32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అమరావతిలో హైకోర్టు కడుతున్నామన్నారు.
Similar News
News December 28, 2025
కామారెడ్డి జిల్లాలో గ్రామ పాలన ఆఫీసర్స్ కమిటీ ఎన్నిక

గ్రామ పాలన ఆఫీసర్స్ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షుడు గరికె ఉపేందర్ పిలుపుతో కామారెడ్డి జిల్లా కమిటీ ఎన్నికలు నిర్వహించారు. రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు ముదం చిరంజీవి ఆధ్వర్యంలో ఓటింగ్ విధానంలో కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షునిగా వెంకటేశ్ ఎన్నికయ్యారు. కొత్త కమిటీ జిల్లా స్థాయిలో గ్రామ పాలన ఆఫీసర్ల సమస్యల పరిష్కారానికి పనిచేయనుంది.
News December 28, 2025
కామారెడ్డి: ఫిబ్రవరిలో జనసేన క్రియాశిలక సభ్యత్వాలు

కామారెడ్డి దేవి విహార్‌లో జనసేన జిల్లా కార్యకర్తల సమావేశం నిర్వహించారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని జీవన్ నాయక్ పిలుపునిచ్చారు. ఫిబ్రవరిలో క్రియాశీలక సభ్యత్వాలు నిర్వహించాలని రవీందర్ చౌహన్ సూచించారు. ఈ కార్యక్రమంలో సాయి కృష్ణ, కృష్ణ స్వామి, సుకదేవ్, కార్యకర్తలు పాల్గొన్నారు.
News December 28, 2025
భారత్ ఖాతాలో మరో విజయం

శ్రీలంక ఉమెన్స్‌తో జరుగుతున్న 5 T20ల సిరీస్‌లో భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. తాజాగా జరిగిన 4వ T20లో IND 30 రన్స్ తేడాతో గెలిచింది. 222 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన SL 20 ఓవర్లలో 191/6 రన్స్‌కే పరిమితమైంది. ఓపెనర్లు ఆటపట్టు(52), పెరెరా(33) దూకుడుగా ఆడినా వారు ఔటయ్యాక రన్‌రేట్ పెరిగిపోవడంతో ఓటమిపాలైంది. IND బౌలర్లలో అరుంధతి, వైష్ణవి చెరో 2 వికెట్లు తీశారు. సిరీస్‌లో IND 4-0 లీడ్ సాధించింది.


