News December 26, 2025

ఫోన్ ట్యాపింగ్ కేసు.. ముగిసిన ప్రభాకర్‌రావు కస్టడీ

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్‌రావు కస్టోడియల్ విచారణ ముగిసింది. 14 రోజుల పాటు సిట్ విచారించింది. రేపు ఉదయం ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించనుండగా, అనంతరం ఇంటికి వెళ్లనున్నారు. ఆయన స్టేట్‌మెంట్‌ను ఫైనల్ ఛార్జ్‌షీట్‌లో పొందుపరచనున్న సిట్ JAN 16వ తేదీ తర్వాత సుప్రీంకోర్టుకు నివేదిక అందించనుంది. అటు తాను చట్టప్రకారం వ్యవహరించానని, ఎలాంటి తప్పు చేయలేదని ప్రభాకర్‌రావు చెప్పారు.

Similar News

News January 10, 2026

రూ.3వేల కోట్ల విలువైన భూములను కాపాడిన హైడ్రా

image

TG: హైదరాబాద్‌లోని మియాపూర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టింది. మక్తా మహబూబ్ పేటలో 15 ఎకరాల ప్రభుత్వ భూములను కాపాడింది. భూఆక్రమణల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన హైడ్రా అక్రమ నిర్మాణాలను తొలగించి తాజాగా హద్దులను నిర్ణయించి ఫెన్సింగ్ వేసింది. ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ బోర్డులు ఏర్పాటు చేసింది. ఈ భూముల విలువ ₹3వేల కోట్లు ఉంటుందని పేర్కొంది. తప్పుడు సర్వే నంబర్లతో కబ్జాకు పాల్పడిన ఇమ్రాన్‌పై కేసు నమోదైంది.

News January 10, 2026

అసభ్య ఫొటోల ఎఫెక్ట్.. ‘గ్రోక్‌’పై ఇండోనేషియా వేటు!

image

ఎలాన్ మస్క్‌కు చెందిన ‘గ్రోక్’ చాట్‌బాట్‌లో <<18752905>>అసభ్య ఫొటోలు<<>>, ఇతర అశ్లీల కంటెంట్ పెరిగిపోవడంతో ఇండోనేషియా కీలక నిర్ణయం తీసుకుంది. గ్రోక్‌ను తాత్కాలికంగా బ్లాక్ చేసింది. ఆ Ai టూల్‌పై చర్యలు తీసుకున్న తొలి దేశంగా నిలిచింది. డిజిటల్ స్పేస్‌లో వస్తున్న అసభ్య కంటెంట్‌ను మానవహక్కులు, పౌరుల భద్రతా ఉల్లంఘనగా తమ ప్రభుత్వం చూస్తోందని మంత్రి మోత్యా హఫీద్ చెప్పారు. Xకు నోటీసులు పంపినట్లు తెలిపారు.

News January 10, 2026

ఇతిహాసాలు క్విజ్ – 123 సమాధానం

image

ఈరోజు ప్రశ్న: దశగ్రీవుడు అంటే ఎవరు?
సమాధానం: దశగ్రీవుడు అంటే 10 తలలు కలిగిన వాడు. అంటే రామాయణంలోని రావణాసురుడు. పుట్టుకతోనే ఆయనకు 10 తలలు ఉండటం వల్ల ‘దశగ్రీవుడు’ (పది మెడలు కలవాడు) అనే పేరు వచ్చింది. ఇవి ఆయన అపారమైన వేద పాండిత్యానికి, పది దిక్కులపై ఆయనకున్న పట్టుకు, ఆయనలోని పది రకాల మానసిక వికారాలకు సంకేతంగా నిలుస్తాయి. <<-se>>#Ithihasaluquiz<<>>