News December 26, 2025

రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ సాఫ్ట్‌బాల్ విజేత నిజామాబాద్ జట్టు

image

రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ సాఫ్ట్ బాల్ పోటీల విజేతగా నిజామాబాద్ జట్టు నిలిచిందని జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి మర్కంటి గంగ మోహన్ తెలిపారు. ఈ టోర్నమెంట్‌లో TGSWRS ధర్మారం విద్యార్థిని మాదరి ప్రణయ ప్రత్యేక బహుమతిని అందుకుందన్నారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలన్నారు. జిల్లా జట్టు కోచ్ మేనేజర్లు అనికేత్, రమేష్ వినయ్, వీణ అభినందించారు.

Similar News

News January 13, 2026

బోధన్ శివారులో డీసీఎం ఢీకొని వ్యక్తి మృతి

image

నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణ శివారులో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. రుద్ర వెంచర్ వద్ద ద్విచక్ర వాహనపై వెళ్తున్న లంగ్డ పూర్ పూర్ గ్రామానికి చెందిన అంజి (38)ని డీసీఎం వ్యాన్ ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

NZB జిల్లా ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు: కలెక్టర్

image

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. భోగభాగ్యాలనిచ్చే భోగి, సరదాలు పంచే సంక్రాంతి వేడుక ప్రజలందరికీ ఆనందం పంచాలని ఆకాంక్షించారు. నూతన సంవత్సరంలో శుభాలు సమకూరాలని, అనుకున్న కార్యాలన్నీ నెరవేరాలని, ఏడాది పొడుగునా ఇంటింటా సిరుల కాంతులు విలసిల్లాలని అభిలషించారు.