News December 26, 2025

వచ్చే ఏప్రిల్ నాటికి పలాస రైల్వే వంతెన: రామ్మోహన్ నాయుడు

image

శ్రీకాకుళం జిల్లా వాసులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న పలాస- కాశీబుగ్గ రైల్వే ఓవర్ బ్రిడ్జి వంతెన త్వరలో అందుబాటులోకి రానుంది. ఇందుకు సంబంధించి కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కార్యాలయం నుంచి గురువారం ప్రకటన వెలువడింది. ఇప్పటికే పలు దఫాలుగా పలాస-కాశీబుగ్గ రైల్వే ఓవర్ బ్రిడ్జితో పాటు, తాలపధ్ర రైల్వే బ్రిడ్జిల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించామని మంత్రి స్పష్టం చేశారు.

Similar News

News January 21, 2026

కాశీబుగ్గ ఆలయంలో భారీ చోరీ.. ఎక్కడి వాళ్లు చేశారంటే!

image

కాశీబుగ్గ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఇటీవల జరిగిన చోరీ ఘటనకు సంబంధించిన కేసును పోలీసులు ఛేదించారు. ఈ మేరకు మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ కే.వీ మహేశ్వర రెడ్డి వివరాలు వెల్లడించారు. ఘటనలో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి చోరీకి గురైన బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఎల్.ఎన్.పేట మండలానికి చెందిన వారిగా గుర్తించారు.

News January 21, 2026

SKLM: రెండో రోజు హెలికాఫ్టర్ రైడ్‌లో ఎంత మంది విహరించారంటే?

image

రథసప్తమి ఉత్సవాలు పురస్కరించుకుని ఏర్పాటు చేసిన హెలికాఫ్టర్ రైడ్‌ను శ్రీకాకుళం వాసులు ఆస్వాదిస్తున్నారు. మంగళవారం రెండో రోజు దాదాపు 174 మంది హెలికాఫ్టర్‌లో విహరించగా రూ.3,82,400 వసూలయ్యాయి. రైడర్లకు ప్రత్యేకంగా స్వామి వారి చిన్న విగ్రహం, ప్రసాదాన్ని అందజేస్తున్నారు. డచ్ బంగ్లా వద్ద ప్రత్యేకంగా బుకింగ్ కౌంటర్‌ను ఏర్పాటు చేశారు. రూ.2,200 చెల్లించి టికెట్ తీసుకోవాలి.

News January 21, 2026

రాజాం పోలిపల్లి అమ్మవారి జాతర.. షెడ్యూల్ ఇదే

image

రాజాం పోలిపల్లి అమ్మవారి జాతర ఈ ఏడాది ఫిబ్రవరిలో జరగనుంది.

➱ఫిబ్రవరి 20న (శుక్రవారం) అమ్మవారి నేత్రోత్సవం

➱22న (ఆదివారం) జాతర ప్రారంభం

➱23న (సోమవారం) పసుపు, కుంకుమ, ముర్రాటలతో మొక్కులు చెల్లిస్తారు

➱24న (మంగళవారం) రాత్రి గుడిలోకి ఘటాలు రావడంతో జాతర ముగుస్తుంది.

చివరి రోజున వేల సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆలయ కమిటీ అన్నీ ఏర్పాట్లు చేస్తోంది.