News December 26, 2025
పెన్నా నదిలో చిక్కుకున్న వృద్ధుడిని కాపాడిన పోలీసులు

పెన్నా నదిలో చిక్కుకున్న వృద్ధుడిని కోవూరు పోలీసులు సురక్షితంగా రక్షించారు. ఓ వృద్ధుడు గేదెలను తోలుకుంటూ జమ్మిపాళెం వద్ద పెన్నా నదిలోకి వెళ్లిన సమయంలో పెన్నా బ్యారేజ్ నుంచి నీరు విడుదల కావడంతో నదిలో నీటి మట్టం అకస్మాత్తుగా పెరిగింది. ఈ సమాచారం పోలీసులకు తెలియడంతో ఘటనా ప్రాంతానికి చేరుకొని స్థానిక ఈతగాళ్ల సహాయంతో సహాయక చర్యలు చేపట్టి వృద్ధుడిని క్షేమంగా ఒడ్డుకు చేర్చారు.
Similar News
News January 21, 2026
మహిళలతోనే ఆరోగ్యవంతమైన సమాజం: కలెక్టర్

ఆరోగ్యవంతమైన సమాజం మహిళల ఆరోగ్యంతోనే సాధ్యమని, చిన్నతనం నుంచే వ్యాధుల నియంత్రణపై మహిళలు అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ హిమాన్సు శుక్లా అన్నారు. మంగళవారం డీకే డబ్ల్యూ కళాశాలలో నిర్వహించిన హెచ్పీవీ టీకా అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మహిళల్లో గర్భాశయ కాన్సర్ వంటివి ఎక్కువగా ఉన్నాయని, వాటిపై అవగాహన కలిగి తగిన సమయంలో టీకాలు తీసుకోవాలని ఆయన కోరారు.
News January 21, 2026
నెల్లూరు: 11 ప్రాజెక్టులు.. 2942 అంగన్వాడీలు

నెల్లూరు జిల్లా పునర్విభజనతో ICDS శాఖ పరిధి పెరిగింది. గతంలో 12 ప్రాజెక్టులు.. 2934 అంగన్వాడీ కేంద్రాలు ఉండేవి. పునర్విభజనలో కందుకూరు(164), ఉలవపాడు(183) మండలాల పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలు ప్రకాశంలో కలిసిపోగా.. గూడూరు, చిల్లకూరు, కోట పరిధిలోని 355 కేంద్రాలు నెల్లూరులోకి వచ్చాయి. దీంతో జిల్లాలో 11 ప్రాజెక్టులు, 2942 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి.
News January 21, 2026
నెల్లూరు: అసలు దొంగలు ఎవరు..?

ఉదయగిరిలో పట్టుబడిన <<18909764>>ఎర్ర చందనం <<>>వెనుక అసలు పాత్రదారులు ఎవరనేది ప్రశ్నార్థకంగా ఉంది. అటవీ సిబ్బంది, పోలీసులకు తెలియకుండా భైరవకోన కొండ ప్రాంతం నుంచి ఉదయగిరి అర్లపడియ వైపు ఎర్రచందనం ఎలా వచ్చిందో తెలియాల్సి ఉంది. అక్కడ గ్రామస్థులు అడ్డుకోకపోయి ఉంటే సరిహద్దులు దాటి వెళ్లిపోయేది. నిఘాపెట్టాల్సిన పోలీసులు, అటవీ రేంజ్ సిబ్బందికి తెలియకుండానే ఇది జరిగి ఉంటుందా? అని స్థానికులు అనుమానిస్తున్నారు.


