News December 26, 2025
రాజమండ్రి: కాంగ్రెస్ తీరు ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు- పురందేశ్వరి

‘ఓట్ చోరీ’ పేరుతో కాంగ్రెస్ పార్టీ పార్లమెంటును అడ్డుకుంటూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని MP పురందేశ్వరి విమర్శించారు. రాజమండ్రిలో గురువారం జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. కీలక అంశాలపై చర్చ జరగకుండా సభా సమయాన్ని వృథా చేస్తున్న కాంగ్రెస్ అనైతిక చర్యలను ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడటంలో కాంగ్రెస్ విఫలమైందని మండిపడ్డారు.
Similar News
News February 20, 2026
తూ.గో: ‘క్వింటా శనగలు రూ.5,875కే కొనుగోలు’

ఏపీ మార్క్ ఫెడ్ ద్వారా తూ.గో జిల్లాలో 2025-26 రబీ సీజన్‌లో రైతులు పండించిన శనగలను కనీస మద్దతు ధర క్వింటా రూ.5,875 చొప్పున కొనుగోలు చేయుటకు చర్యలు చేపట్టినట్లు జిల్లా మార్క్‌ఫెడ్ మేనేజర్ దేవరపు ప్రతాప్ శుక్రవారం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా RBK వద్ద శనగల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించుటకు నిర్ణయించామన్నారు. మరిన్ని వివరాలకు RBK కేంద్రాల్లో సంప్రదించాలని సూచించారు.
News February 20, 2026
జిల్లా రిజిస్ట్రార్‌గా జగన్మోహనరావు బాధ్యతల స్వీకారం

తూ.గో. జిల్లా నూతన రిజిస్ట్రార్‌గా కె.జగన్మోహనరావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. 1993లో జూనియర్ అసిస్టెంట్‌గా ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన, సీనియర్ అసిస్టెంట్‌గా, గ్రేడ్-2, గ్రేడ్-1 సబ్ రిజిస్ట్రార్‌గా వివిధ హోదాల్లో పనిచేశారు. మచిలీపట్నం సబ్ రిజిస్ట్రార్‌గా సేవలందిస్తూ పదోన్నతిపై ఇక్కడకు విచ్చేశారు. ఈ సందర్భంగా పలువురు సబ్ రిజిస్ట్రార్‌లు, సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
News February 19, 2026
గొల్లగూడెం: ట్రాక్టరుపై నుంచి పడి బాలిక స్పాట్ డెడ్

దేవరపల్లి మండలంలోని గొల్లగూడెం వద్ద గురువారం జరిగిన ప్రమాదంలో 11 ఏళ్ల బాలిక మృతి చెందింది. నిడదవోలు మండలం సమీశ్రగూడెంకు చెందిన ఓ కుటుంబం పొగాకు పనుల నిమిత్తం దుమంతులగూడెం వలస వచ్చింది. పనికి వెళ్తుండగా ట్రాక్టరుపై నుంచి బాలిక ప్రమాదవశాత్తు జారి కిందపడటంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. దేవరపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


