News April 24, 2024
హైకోర్టు తీర్పు చట్ట విరుద్ధం: సీఎం మమత

2016లో జరిగిన టీచర్ రిక్రూట్‌మెంట్‌ను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన <<13101174>>తీర్పు<<>>ను పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తప్పుబట్టారు. దాన్ని చట్టవిరుద్ధమైన చర్యగా అభివర్ణించారు. ఈ తీర్పుతో ఉద్యోగాలు కోల్పోయిన వారికి మద్దతుగా తాము ఉంటామని చెప్పారు. వారందరికీ న్యాయం జరిగేలా చూస్తామని, హైకోర్టు తీర్పుపై తాము పైకోర్టుకు వెళతామని అన్నారు.
Similar News
News January 8, 2026
న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు

న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ <
News January 8, 2026
తిలక్ వర్మకు సర్జరీ? న్యూజిలాండ్ సిరీస్‌కు దూరం!

స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ NZతో జరిగే T20 సిరీస్‌కు దూరమయ్యే అవకాశం కనిపిస్తోంది. విజయ్ హజారే ట్రోఫీ సమయంలో తీవ్రమైన కడుపునొప్పితో హాస్పిటల్‌లో చేరిన ఆయనకు డాక్టర్లు సర్జరీ సూచించినట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పేర్కొంది. కోలుకోవడానికి 3-4 వారాలు పడుతుందని సమాచారం. ఫిబ్రవరి 7న జరిగే T20 వరల్డ్ కప్ కల్లా తను ఫిట్ అవుతాడా లేదా అన్నది ఇప్పుడు ఆందోళనగా మారింది. తిలక్ స్థానంలో ఎవర్ని తీసుకుంటారో చూడాలి!
News January 8, 2026
మిరపలో నల్ల తామర పురుగుల నివారణ ఎలా?

మిరపలో నల్ల తామర పురుగుల తీవ్రతను బట్టి ఎకరానికి 25కు పైగా నీలి రంగు జిగురు అట్టలను ఏర్పాటు చేసుకోవాలి. అలాగే బవేరియా బస్సియానా 5 గ్రాములు లేదా స్పైనటోరం 0.9ml మందును లేదా ఫిప్రోనిల్ 5% ఎస్.సి 2ML లేదా స్పైనోసాడ్ 45% ఎస్.సి 0.3MLలలో ఏదో ఒకదానిని లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. తామర పురుగు ఉద్ధృతిని బట్టి ఈ మందులను మార్చిమార్చి పిచికారీ చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.


