News April 24, 2024
జగన్‌పై దాడి కేసు.. కోర్టులో పోలీసుల పిటిషన్

AP: సీఎం జగన్‌పై రాయితో దాడి చేసిన కేసులో పోలీసులు విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నిందితుడు సతీశ్ నుంచి వాంగ్మూలం తీసుకోవాలని న్యాయస్థానాన్ని పోలీసులు కోరగా.. 164 సీఆర్పీసీ ప్రకారం వాంగ్మూలం అక్కర్లేదని నిందితుడి న్యాయవాది కోర్టుకు వివరించారు. విచారించిన కోర్టు.. ఈ నెల 29లోపు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 29వ తేదీకి వాయిదా వేసింది.
Similar News
News March 21, 2026
మరో రెండు LPG నౌకలు వచ్చేస్తున్నాయ్!

పశ్చిమాసియా యుద్ధం కారణంగా హార్ముజ్ వద్ద నిలిచిపోయిన నౌకల్లో 2 భారత్ రానున్నాయి. LPG ఉన్న పైన్ గ్యాస్, జగ్ వసంత్ షిప్‌లు ప్రస్తుతం UAEలోని షార్జా వద్ద ఉన్నాయి. ఇవి భారత జెండాతో నేటి నుంచి ప్రయాణించే అవకాశం ఉంది. గతవారం రెండు LPG నౌకలను ఇరాన్ వదిలిపెట్టడంతో అవి మనదేశానికి చేరుకున్నాయి. వీటికి కూడా ఇరాన్ అడ్డుకట్ట వేయదని IND భావిస్తోంది. ఈ రెండు నౌకలు వస్తే దేశంలో గ్యాస్ కొరత కాస్త తీరనుంది.
News March 21, 2026
గోదావరిలో ఐదుగురు గల్లంతు.. మృతదేహాలు లభ్యం

TG: భద్రాచలం సమీపంలోని కొల్లుగూడెం ఇసుక ర్యాంప్ వద్ద గోదావరిలో గల్లంతైన ఐదుగురు యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. చనిపోయిన వారిని శ్రీకర్, అభిరామ్, నవదీప్, సతీశ్, తేజగా గుర్తించారు. నిన్న ముగ్గురి మృతదేహాలు దొరకగా ఈరోజు మిగిలిన ఇద్దరి మృతదేహాలను గజ ఈతగాళ్లు బయటకు తీశారు. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు.
News March 21, 2026
భారత్ – ఐర్లాండ్ మధ్య 2 టీ20లు

భారత్, ఐర్లాండ్ మధ్య రెండు టీ20ల షెడ్యూల్‌ను BCCI విడుదల చేసింది. జూన్ 26, 28వ తేదీల్లో 2 మ్యాచులు ఆడనున్నట్లు పేర్కొంది. 2 టీ20లూ బెల్‌ఫాస్ట్(ఐర్లాండ్) వేదికగా జరగనున్నాయి. భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు మ్యాచులు ప్రారంభం కానున్నాయి. 2007 తర్వాత ఈ వేదికలో భారత్ మళ్లీ ఇప్పుడే ఆడనుంది. ఆ వెంటనే జులై 1 నుంచి 11వ తేదీ వరకు భారత్-ఇంగ్లండ్ మధ్య 5టీ20లు జరగనున్నాయి.


