News December 26, 2025
కామారెడ్డి: అటకెక్కిన ‘ఇందిరమ్మ’ మోడల్ హౌస్ నిర్మాణం!

సొంత ఇంటి కలను నిజం చేసేందుకు ప్రభుత్వం ‘ఇందిరమ్మ ఇళ్ల’ పథకాన్ని ప్రవేశపెట్టింది. లబ్ధిదారులు తమ ఇళ్లను ఎలా నిర్మించుకోవాలో అవగాహన కల్పించేందుకు ప్రతి మండలలో ఒక ‘ఆదర్శ ఇందిరమ్మ ఇల్లు’ నిర్మించాలని నిర్ణయించింది. అయితే, పిట్లంలో ఈ ఆదర్శ గృహ నిర్మాణం అధికారుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా మారింది. పనులు ప్రారంభమై తొమ్మిది నెలలు గడుస్తున్నా నేటికీ పూర్తి కాలేదు. సగంలోనే ఆగిపోయి దర్శనమిస్తోంది.
Similar News
News December 29, 2025
2025 రివైండ్… గుంటూరు జిల్లాలో పాజిటివ్ న్యూస్

గుంటూరు జిల్లాకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కలిపి సుమారు రూ.955 కోట్ల విలువైన మౌలిక వసతుల ప్రాజెక్టులకు ఆమోదం తెలిపాయి. రియల్ ఎస్టేట్ రంగంలో గుంటూరు దేశంలోనే వేగంగా ఎదుగుతున్న టియర్-2 నగరంగా నిలిచి, భూమి ధరలు 51 శాతం పెరిగాయి. ప్రజారోగ్య రంగంలో భాగంగా ప్రత్తిపాడులో రూ.150 కోట్లతో 100 పడకల ఈఎస్‌ఐ ఆసుపత్రి మంజూరైంది. అలాగే గుంటూరు కాలువ ఆధునీకరణకు రూ.400 కోట్లు కేటాయించారు.
News December 29, 2025
నేటి నుంచి అసెంబ్లీ.. భద్రాచలం MLA ఎటువైపు..!

అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉమ్మడి జిల్లాకు చెందిన 10మంది ఎమ్మెల్యేల్లో తొమ్మిది మంది కాంగ్రెస్ నుంచే ఉండగా.. జిల్లా సమస్యలపై సభలో చర్చ జరుగుతుందని ప్రజలు ఆశిస్తున్నారు. అటు భద్రాచలం MLA తెల్లం వెంకటరావు పార్టీ ఫిరాయింపుపై కేసు నడుస్తున్న నేపథ్యంలో ఆయన ఏ పక్షాన కూర్చుంటారన్నది ఆసక్తికరంగా మారింది. ఈసారి సమావేశాల్లో కొన్ని సమస్యల పరిష్కారం ఉంటుందని ప్రజలు ఎదురుచూస్తున్నారు.
News December 29, 2025
నిర్మల్: నీటిలోకి తోసేసి చంపేశారు

నిర్మల్ జిల్లాలో గల్లంతైన సారంగాపూర్ మం. లింగాపూర్ వాసి కార్తీక్ మృతదేహం ఆదివారం లభ్యమైంది. ఈనెల 25న మేనబావ గంగాప్రసాద్ మరో మైనర్‌తో బయటివెళ్లిన కార్తీక్ శవమయ్యాడు. తనకు ఈత రాదని చెప్పినా వినిపించుకోకుండా మద్యం మత్తులో ఉన్న మేనబావ, బాలుడు నీటిలోకి తోసేయడంతో మృతిచెందాడు. గజఈతగాళ్ల సాయంతో మృతదేహాన్ని బయటికి తీశామని, నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.


