News December 26, 2025
దొంగల ముఠాల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన జిల్లా పోలీసులు!

కామారెడ్డి జిల్లాలో వరుస దోపిడీలు, దారి దోపిడీలకు పాల్పడుతున్న ఐదు ముఠాలను ఈ ఏడాది పోలీసులు అరెస్ట్ చేశారు. పార్ది గ్యాంగ్ 1 & 2 లో 11 మందిని అరెస్ట్ చేసి, నలుగురిపై PD యాక్ట్ నమోదు చేశారు. కంజర్ భట్ & గడ్డపార గ్యాంగ్ లో 10 మందిని అరెస్ట్ చేసి, వారి నుంచి ₹15.45 లక్షల సొత్తు స్వాధీనం చేసుకున్నారు. సోషల్ మీడియా వేదికగా బెదిరింపులకు పాల్పడుతున్న ఐదుగురిని పట్టుకుని నగదు, ఫోన్లు సీజ్ చేశారు.
Similar News
News January 8, 2026
పవన్ వద్ద పంచాయితీ.. సదుం వాసుల వాదన ఇది.!

సదుంలో మైనింగ్ కోసం సేకరించిన<<18792414>> భూముల్లో<<>> అధికంగా డీకేటీ భూములు ఉండటంతో పరిహారం అంశం ప్రధాన సమస్యగా మారింది. భూములు కోల్పోయిన రైతులకు తగిన నష్టపరిహారం చెల్లిస్తామని యాజమాన్యం హామీ ఇచ్చినా, పనులు ప్రారంభమైన తర్వాత పరిహారం విషయంలో నిర్లక్ష్యం వహిస్తోందని గ్రామ కమిటీ ఆరోపిస్తోంది. ఈ అంశంపై రైతులు ఇప్పటికే అధికారులకు ఫిర్యాదులు చేసినా స్పష్టమైన పరిష్కారం కనిపించలేదని వారు అంటున్నారు.
News January 8, 2026
MNCL: పదో తరగతి పరీక్షలకు ‘తత్కాల్’ ఫీజు షెడ్యూల్ విడుదల

పదో తరగతి వార్షిక పరీక్షలకు సంబంధించి పరీక్ష రుసుము చెల్లించలేకపోయిన విద్యార్థులకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. 2026 మార్చిలో జరగనున్న పరీక్షల కోసం తత్కాల్ పద్ధతిలో ఫీజు చెల్లించేందుకు షెడ్యూల్ విడుదల చేసినట్లు మంచిర్యాల జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) యాదయ్య తెలిపారు. రూ.1000 అపరాధ రుసుముతో ఈ నెల 21 నుంచి 27వ వరకు పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు.
News January 8, 2026
రైళ్ల శుభ్రతపై భారీగా ఫిర్యాదులు

ట్రైన్లలో కోచ్‌ల శుభ్రత, బెడ్ రోల్స్‌కు సంబంధించి Rail Madad యాప్‌లో గత ఏడాది సెప్టెంబర్‌లో 8,758 ఫిర్యాదులు నమోదు కాగా, అక్టోబర్ (13,406), నవంబర్ (13,196)లో సుమారు 50% పెరుగుదల కనిపించింది. అదే సమయంలో ‘సంతృప్తికర’ ఫీడ్‌బ్యాక్‌లు కూడా తగ్గాయి. ఈ పరిస్థితిని గమనించిన రైల్వే మంత్రిత్వ శాఖ అన్ని జోన్లకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఫిర్యాదులు వేగంగా పరిష్కారమయ్యేలా చూడాలని సూచించింది.


