News April 24, 2024

అల్లూరి: లొంగిపోయిన ఆరుగురు మావోయిస్టులు

image

అల్లూరి జిల్లా పోలీసుల ఎదుట ఆరుగురు మావోయిస్టులు లొంగిపోయారు. దీనికి సంబంధించిన వివరాలను డీఐజీ విశాల్ గున్ని వెల్లడించారు. సీపీఐ మావోయిస్టు యూజీ క్యాడర్‌కి చెందిన ఆరుగురు పోలీసులకు స్వచ్ఛందంగా లొంగిపోయారన్నారు. గతంలో వీరిపై రూ.19 లక్షల రివార్డును ప్రభుత్వం ప్రకటించినట్లు చెప్పారు. లొంగిపోయిన వారికి పునరావాసం కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ తుహిన్ సిన్హా, తదితర అధికారులు పాల్గొన్నారు.

Similar News

News January 23, 2026

ప్రతి ప్రభుత్వ కార్యాలయం పరిశుభ్రంగా ఉండాలి: విశాఖ కలెక్టర్

image

ఈనెల 4వ శనివారం (జనవరి 24) జిల్లావ్యాప్తంగా ‘జీరో-గ్యాప్ శానిటేషన్ ఆంధ్ర’ కార్యక్రమాన్ని నిర్వహించాలని విశాఖ కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర (SASA)లో భాగంగా ఉదయం 6 గంటల నుంచే అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టాలన్నారు. 86 విభాగాలు సమన్వయంతో పాల్గొని వివరాలను సాసా యాప్‌లో అప్‌లోడ్ చేయాలని స్పష్టం చేశారు.

News January 23, 2026

విశాఖ ఉత్సవ్ నిర్వహణకు అధికారులకు బాధ్యతలు

image

విశాఖ ఉత్సవ్-2026లో నిర్వహిస్తున్న సాంస్కృతి కార్యక్రమాల సమన్వయ బాధ్యతలను స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శైలజ పర్యవేక్షిస్తారని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. విద్యుత్, వైద్య శాఖల అధికారులతో విశ్వ ప్రియ ఫంక్షన్ హాల్ వద్ద ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఆర్కే బీచ్ ప్రధాన వేదిక వద్ద ఏర్పాటు బాధ్యతలను ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ కేవీ.రామలక్ష్మికి‌ అప్పగించారు.

News January 23, 2026

రూర్కెలా-జగదల్‌పూర్ ట్రైన్‌కు అదనపు బోగీ

image

రూర్కెలా-జగదల్‌పూర్ (ట్రైన్ నంబర్ 18107)కి అదనపు భోగిని ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వే అధికారులు శుక్రవారం తెలిపారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రద్దీని అదుపు చేసేందుకు గాను తాత్కాలికంగా ఒక స్లీపర్ క్లాస్‌ భోగిని అదనంగా ఏర్పాటు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి ఈ సేవను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.