News December 26, 2025

కొబ్బరికాయలతో మేడారం వెళ్తున్న లారీ దగ్ధం

image

తాడ్వాయి మండలంలో ఓ లారీ ప్రమాదవశాత్తు దగ్ధమైంది. మండలంలోని కొడిశెల లింగాల గ్రామాల మధ్య అడవిలో గురువారం రాత్రి కొబ్బరికాయల లోడుతో మేడారం వెళుతుండగా ప్రమాదవశాత్తు లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీకి మంటలు అంటుకొని దగ్ధమైనట్లు అటుగా వెళ్లిన ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News January 11, 2026

హన్మకొండ: రైలుకు ఎదురుగా వెళ్లి సూసైడ్

image

హసన్ పర్తి మండలం చింతగట్టు రైల్వే గేట్ వద్ద విషాద ఘటన జరిగింది. గుర్తు తెలియని వ్యక్తి తన బైక్‌ను పక్కన పెట్టి రైలుకు ఎదురుగా వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. పల్సర్ 150(నంబర్ AP36 AM 8417)పై అతను వచ్చినట్లు స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపడుతున్నారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.

News January 11, 2026

సిరిసిల్ల: 183 గ్రామాల్లో తాగునీటి సరఫరా నిలిపివేత

image

శాత్రాజుపల్లి వద్ద ప్రధాన పైప్ లైన్ లీకేజీ కారణంగా 183 గ్రామాలకు తాగునీటికి అంతరాయం ఏర్పడినట్లు వేములవాడ సబ్ డివిజన్ మిషన్ భగీరథ DEE సిహెచ్ విశ్వన్ తెలిపారు. వేములవాడ (2), వేములవాడ రూరల్ (20), బోయినపల్లి (30), గంగాధర (45), కొడిమ్యాల (32), మల్యాల (29), చొప్పదండి (25) గ్రామాలకు ఈనెల 13వ తేదీ వరకు తాగునీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని, గ్రామాలలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ఆయన సూచించారు.

News January 11, 2026

లేట్ కాకముందే డీల్ చేసుకోండి.. క్యూబాకు ట్రంప్ హెచ్చరిక

image

క్యూబాకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. తమతో వీలైనంత త్వరగా ఒప్పందం కుదుర్చుకోవాలని స్పష్టం చేశారు. ‘ఇకపై క్యూబాకు ఆయిల్ లేదా డబ్బు వెళ్లదు. ఆలస్యం కాకముందే డీల్ చేసుకోవాలని సూచిస్తున్నా. వెనిజులా నుంచి వస్తున్న ఆయిల్, డబ్బుతో చాలా ఏళ్లు క్యూబా బతికింది. అందుకు బదులుగా వెనిజులాకు సెక్యూరిటీ సర్వీసెస్ అందించింది. ఇకపై అలా జరగబోదు’ అని ట్రూత్ సోషల్‌లో రాసుకొచ్చారు.