News April 24, 2024

మంత్రి సీతక్కతో కలిసి నామినేషన్ వేసిన ఆత్రం సుగుణ

image

ఆదిలాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణ సోమవారం మంత్రి సీతక్కతో కలిసి నామినేషన్ వేశారు. ఆదిలాబాద్‌లోని కలెక్టరేట్‌లో రిటర్నింగ్ అధికారి రాజర్షి షాకు ఆమె నామినేషన్ పత్రాలను సమర్పించారు. వారితో పాటు ఖానాపూర్ ఎమ్మెల్యే వేడ్మ బొజ్జు, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, నిర్మల్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీహరి రావు ఉన్నారు. ఇప్పటివరకు ఆమె రెండు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు.

Similar News

News April 6, 2026

ఆదిలాబాద్: CM సభ.. ట్రాఫిక్ మళ్లింపు

image

★ ఇచ్చోడ TO పిప్రి వరకు వన్ వే విధానం
★ టూవీలర్, ఆటోలు, కార్ల పార్కింగ్ వారికి కేటాయించిన వాటిలోనే పార్కింగ్ చేయాలి.
★ నిర్మల్ నుంచి వచ్చే వాహనాలు బోథ్ ఎక్స్ రోడ్డు మీదుగా బజారత్నూర్ చేరుకొని, సభాస్థలికి రావాలి.
★ భారీ వాహనాలకు బస్సులకు కేటాయించిన స్థలంలోనే పార్కింగ్ చేయాలి.
★ ఆటోలు, టూ వీలర్స్ ఇచ్చోడ బస్టాండ్ మీదుగా దిగ్నూర్ గంగాపూర్ లక్ష్మీ నాయక్ తండా మీదుగా సభస్థలం వద్దకు చేరుకోవాలి.

News April 6, 2026

ఆదిలాబాద్: CM వస్తుండు.. వరాలు కురిపించేనా..?

image

బజారత్నూర్ మండలం పిప్రి గ్రామంలో నేడు సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ నిర్వహించనున్నారు. పిప్రి వేదికగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఏమైనా వరాలు కురిపిస్తారని ప్రజలు గంపెడు ఆశలతో ఉన్నారు. ఉమ్మడి జిల్లాకు యూనివర్సిటీ, ఇంజినీరింగ్ కళాశాల, ఎయిర్ పోర్ట్ గురించి అప్డేట్, బాసర, ఐఐఐటీ అలాగే పెండింగ్ ప్రాజెక్టుల గురించి ఏమైనా మాట్లాడ్తారని సర్వత్రా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

News April 5, 2026

ADB: సీఎం పర్యటన నేపథ్యంలో ప్రజావాణి రద్దు

image

ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఈనెల 6న రద్దు చేసినట్లు కలెక్టర్ రాజర్షి షా ఒక ప్రకటనలో తెలిపారు. సీఎం బజార్‌హత్నూర్ మండలం పిప్రి గ్రామంలో పర్యటించనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. కావున ఫిర్యాదుదారులు ఎవరూ కలెక్టరేట్‌కు రావద్దని, ఈ మార్పును గమనించి ప్రజలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.