News December 26, 2025
జంపన్నా ఈసారి అంతేనా?

మేడారం మహాజాతరను దృష్టిలో పెట్టుకుని జంపన్నవాగుపై ఊరట్టం వద్ద చేపడుతున్న కాజ్వే పనులు నత్తనడకన సాగుతోంది. రూ.50 లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన పనుల్లో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపం కనిపిస్తున్నాయి. గత మినీ జాతరలో కూలిన కాజ్వే మాదిరిగానే ఈసారి కూడా వరద ముప్పు ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాత్కాలిక కాజ్వే బదులు శాశ్వత వంతెన నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు.
Similar News
News December 28, 2025
సిరిసిల్ల : TSUTF రాష్ట్ర సదస్సుకు తరలిన నేతలు

TSUTF రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశాలకు జిల్లాలోని ఆ సంఘం నాయకులు తరలి వెళ్లారు. ఈ నెల 28, 29 జనగామ జిల్లా కేంద్రంలో ఈ సదస్సు జరుగుతుందన్నారు. రెండు రోజులపాటు జరిగే సమావేశాల్లో ప్రభుత్వ విద్య రంగం బలోపేతంపై కార్యచరణ చర్చించడం జరుగుతుందని జిల్లా ప్రధాన కార్యదర్శి జంగటి రాజు తెలిపారు. సదస్సుకు వెళ్లిన వారిలో మహేందర్, రమేష్, తిరుపతి జాదవ్, సంతోష్ ఉన్నారు.
News December 28, 2025
పాలమూరు: పతంగి కొనివ్వలేదని బాలుడి ఆత్మహత్య

మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండలం చిల్వేర్ గ్రామంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. రాజు-శ్రీలత దంపతుల ఒక్క కుమారుడు సిద్ధు (9), రెండో తరగతి విద్యార్థి. తల్లిదండ్రులు పతంగి కొనివ్వక పోవడంతో మనస్తాపానికి గురై భయపెట్టాలని ఇంటి స్లాబ్‌కు చీరతో ఉరేసుకున్నారు. కుటుంబ సభ్యులు కాపాడే ప్రయత్నం చేసినా విఫలమయ్యారు. కుటుంబంలో విషాదం నెలకొంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News December 28, 2025
మిరపలో ఆకు ముడత తెగులు – యాజమాన్యం

పొలానికి ఆఖరి దుక్కిలో ఎకరాకు 200కిలోల వేప పిండి, తిరిగి బోదెలు ఎగవేయునపుడు 100 కిలోల వేప పిండి వేసుకోవాలి. నారు మొక్కలు నాటే 15 రోజుల ముందు పొలం చుట్టూ 2-3 వరుసల మొక్కజొన్న లేదా సజ్జ మొక్కలను పెంచాలి. నాటిన తర్వాత ఎకరాకు 10 పసుపు, 10 నీలం రంగు జిగురు అట్టలను పొలంలో ఏర్పాటు చేయాలి. నారు మొక్కలను నాటే ముందు ఇమిడాక్లోప్రిడ్ (లీటరు నీటికి 0.5 మి.లీ) మందు ద్రావణంలో 10 నిమిషాల పాటు ముంచి నాటుకోవాలి.


