News December 26, 2025
అనకాపల్లి: రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడు మృతి

అనకాపల్లి మండలం కొత్తూరు జంక్షన్ వద్ద ఈనెల 24వ తేదీ రాత్రి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువకుడు విశాఖ కేజీహెచ్ లో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు ఎస్సై శేషగిరిరావు తెలిపారు. కసింకోట మండలానికి చెందిన పప్పల జ్ఞానేశ్వరరావు (31) ద్విచక్ర వాహనంపై అనకాపల్లి వెళుతూ ఆగి ఉన్న లారీని ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడిన క్షతగాత్రుడిని కేజీహెచ్ కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు.
Similar News
News February 16, 2026
మెదక్: పోలీసు బందోబస్తును పరిశీలించిన ఎస్పీ

మెదక్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల పరోక్ష ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటు చేసిన పోలీసు బందోబస్తు ఎస్పీ శ్రీనివాసరావు పరిశీలించారు. ఆయన సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
News February 16, 2026
BIG BREAKING: కొత్తగూడెం మేయర్‌గా గణేష్ ఎన్నిక

కొత్తగూడెం మొట్టమొదటి కార్పొరేషన్ మేయర్‌గా సుజాతనగర్ 21 డివిజన్ కార్పొరేటర్ మూడు గణేష్‌ను సీపీఐ పార్టీ ఎంపిక చేసింది. ఈ మేరకు కొత్తగూడెం కార్పొరేషన్ కార్యాలయంలో అధికారికంగా సీపీఐ నేతలు మూడు గణేష్ ఎంపికపై వివరాలు వెల్లడించారు. కాగా ఉపమేయర్ పదవిని కాంగ్రెస్‌కు ఇప్పటికే కేటాయించిన విషయం తెలిసిందే.
News February 16, 2026
అనకాపల్లి: నిరంతరాయంగా 10th ప్రీ ఫైనల్ పరీక్షలు

పదో తరగతి ప్రీ ఫైనల్ పరీక్షలు నిరంతరాయంగా జరుగుతున్నాయని DEO అప్పారావు నాయుడు తెలిపారు. ఈ నెల 9న తెలుగుతో మొదలైన ఈ పరీక్షలు సోషల్ స్టడీస్‌తో 17న ముగుస్తాతాయని సోమవారం తెలిపారు. శివరాత్రి జాగరాలు నేపథ్యంలో సోమవారం దాదాపుగా అన్ని పాఠశాలలూ లోకల్ హాలిడేని ప్రకటించాయి. అయినప్పటికీ సోమవారం షెడ్యూల్ ప్రకారం బయాలజీ పరీక్షను నిర్వహిస్తున్నామన్నారు.


