News December 26, 2025
వికారాబాద్: అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ బదిలీ

వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న లింగ్యా నాయక్ బదిలీ అయ్యారు. రాష్ట్రంలో పలు డిప్యూటీ కలెక్టర్లను ప్రభుత్వం బదిలీ చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. అందులో భాగంగా వికారాబాద్ జిల్లాలో రెవిన్యూ విభాగం అదనపు కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న లింగ్యా నాయక్‌ను రాష్ట ఎన్నికల కమిషన్ సెక్రటరీగా నియమించింది.
Similar News
News January 2, 2026
వరంగల్ పోలీసులపై డీజీపీకి MLC ఫిర్యాదు

వరంగల్ నగర పోలీసులపై ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య డీజీపీ శివధర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. WGL తూర్పు నియోజకవర్గంలో రెండేళ్లుగా నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులపై ఉన్నతాధికారులతో విచారణ జరిపి దుర్వినియోగం పాల్పడిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని సారయ్య డీజీపీని కోరారు. ఇప్పటికే WGL CPకి సైతం ఫిర్యాదు చేశారు. WGL తూర్పులో పోలీసులను అడ్డుపెట్టుకొని రౌడీయిజం చేశారని డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు.
News January 2, 2026
పల్నాడు: టిప్పర్ ఢీకొని మహిళ మృతి

క్రోసూరు మండలం అందుకూరు వెళ్లే రోడ్డు మూల వద్ద టిప్పర్ లారీ ఢీకొట్టడంతో మహిళ మృతి చెందింది. స్థానికుల వివరాల మేరకు.. అచ్చంపేట మండలం ఓర్వకల్లు గ్రామానికి చెందిన కోట కుమారిని లారీ ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. క్రోసూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలు పరిశీలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News January 2, 2026
MDK: మద్యం అమ్మకాలు నిషేధిస్తూ తీర్మానం

రామాయంపేట మండలం రాయిలాపూర్‌లో మద్యం అమ్మకాలు నిషేధిస్తూ గ్రామసభ తీర్మానం చేశారు. సర్పంచ్ గట్టు సుశీల అధ్యక్షతన శుక్రవారం గ్రామసభ నిర్వహించారు. గ్రామంలో మద్యం అమ్మకాలు పెరిగిపోవడంతో యువత పెడదారిన పడుతుందని, దీంతో గ్రామంలో మద్యం అమ్మకాలు నిషేధించారు. కిరాణా షాపుల్లో 18 సంవత్సరాల లోపు పిల్లలకు సిగరెట్లు విక్రయించవద్దని ఏకగ్రీవ తీర్మానం చేశారు. మద్యం అమ్మితే రూ.10వేల జరిమానా విధిస్తామన్నారు.


