News December 26, 2025

మానేరు నదిపై హైలెవెల్ వంతెన.. తగ్గనున్న దూరభారం

image

కాటారం మండలం దామెరకుంట మంథని మండలం వెంకటాపూర్ గ్రామాల మధ్య మానేరు నదిపై హైలెవెల్ వంతెన నిర్మాణంతో అటవీ గ్రామాలకు రవాణా సౌకర్యం మెరుగుపడనుంది. తద్వారా కాలేశ్వరం వెళ్ళేందుకు మరో రహదారి సిద్ధమవడంతో పాటు 25 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. కాలేశ్వరం అభివృద్ధి, మహారాష్ట్ర, చత్తీస్‌ఘడ్ రాష్ట్రాల జాతీయ రహదారులకు అనుసంధానంగా మారుతుంది.

Similar News

News December 28, 2025

ఎయిర్‌పోర్ట్ భూముల కబ్జా.. ఏఏఐ అధికారులు సీరియస్

image

మామునూరు ఎయిర్‌పోర్ట్ భూసేకరణ చివరి దశకు వచ్చినా, ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ)కు చెందిన 706 ఎకరాల్లో 9.86 ఎకరాలు కబ్జా అయింది. ఖిలా వరంగల్ మండలం తిమ్మాపూర్ శివారు ఓ సర్వే నంబర్‌లో ఏఏఐకి చెందిన బెస్త చెరువు కాలనీ పరిసరాల్లోనే 9.86 ఎకరాల భూమిలో ఇళ్ల నిర్మాణాలు ఉండడంతో విస్తుపోయిన ఏఏఐ HYD విభాగం జనరల్ మేనేజర్ నటరాజు, డైరెక్టర్ వీవీ రావు రెవెన్యూ అధికారులను అడిగినట్లు తెలిసింది.

News December 28, 2025

కోటీశ్వరుడు.. ర్యాపిడో డ్రైవరయ్యాడు

image

కరోనా కష్టాలు ఒక కోటీశ్వరుడిని ర్యాపిడో డ్రైవర్‌గా మార్చేశాయి. ఒకప్పుడు ₹కోట్లలో వ్యాపారం చేసిన ఆయన కొవిడ్ వల్ల ఏకంగా ₹14 కోట్లు నష్టపోయారు. చేతిలో చిల్లిగవ్వ లేక ఉపాధి కోసం ర్యాపిడో నడుపుతున్నారు. Amity యూనివర్సిటీలో చదివిన అతడు ఒక ప్రయాణికుడితో తన బాధ పంచుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్న కథ నెట్టింట వైరలవుతోంది. ‘ఇప్పటికీ దేవుడిపై నమ్మకం ఉంది. ఓటమిని ఒప్పుకోను’ అంటున్న ఆయన ధైర్యం కదిలిస్తోంది.

News December 28, 2025

పాలమూరులో ‘సైబర్‌’ కలకలం.. పెరుగుతున్న కేసులు

image

సాంకేతికత ముసుగులో సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఉమ్మడి పాలమూరులోని MBNR, NRPT, GDWL, NGKL, WNP పరధిలో 2025 ఏడాదిలో 3625 ఫిర్యాదులు రాగా, 454 కేసులు ఫైల్ అయ్యాయి. గతేడాది 3,003 ఫిర్యాదులు రాగా 236 కేసులు నమోదయ్యాయి. మహబూబ్‌నగర్‌లో అత్యధికంగా 1475 ఫిర్యాదులు రాగా 220 కేసులు నమోదయ్యాయి. నారాయణపేటలో అత్యల్పంగా 318 ఫిర్యాదులు రాగా 59 కేసులు నమోదయ్యాయి.