News April 24, 2024

ఇజ్రాయెల్ ఆర్మీ ఇంటెలిజెన్స్ చీఫ్ రాజీనామా

image

ఇరాన్, పాలస్తీనాతో యుద్ధం కొనసాగుతున్న వేళ ఇజ్రాయెల్ ఆర్మీ ఇంటెలిజెన్స్ చీఫ్ అహరోన్ హలీవా కీలక నిర్ణయం తీసుకున్నారు. గత ఏడాది అక్టోబర్ 7న తమ దేశంపై హమాస్ చేసిన ఆకస్మిక దాడికి బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేశారు. తమకు అప్పగించిన పనిని ఆరోజు సమర్థవంతంగా చేయలేకపోయామని, యుద్ధం వల్ల కలిగిన బాధ తనను నిరంతరం వెంటాడుతోందని ఆయన పేర్కొన్నారు. అక్టోబర్ 7 తన దృష్టిలో బ్లాక్ డే అని చెప్పారు.

Similar News

News February 5, 2025

గచ్చిబౌలిలో విషాదం.. యువతి సూసైడ్

image

గచ్చిబౌలి సిద్దిక్‌నగర్‌లో బుధవారం విషాద ఘటన వెలుగుచూసింది. స్థానికుల వివరాలు.. ఓ హాస్టల్ పై నుంచి దూకి సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు రిటోజా బసు(22)గా గుర్తించారు. అనారోగ్య సమస్యలతో బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News February 5, 2025

రోహిత్ శర్మ రిటైర్‌మెంట్?

image

ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న రోహిత్ శర్మ ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పే సూచనలు కనిపిస్తున్నాయి. BCCI వర్గాల సమాచారం ప్రకారం.. భవిష్యత్తుపై క్లారిటీ ఇవ్వాలని బోర్డు ఇప్పటికే రోహిత్‌కు సూచించింది. ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన అనంతరం రోహిత్ తన రిటైర్మెంట్‌పై ఓ నిర్ణయానికి వచ్చే ఛాన్స్ ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీ ఆధారంగా కొత్త సారథిని ఎంపిక చేయనున్నారని తెలుస్తోంది.

News February 5, 2025

WORLD RECORD: ఒంగోలు జాతి ఆవు ధర రూ.41 కోట్లు

image

సాధారణంగా ఆవు ధర వేలల్లో, కాస్త పాలు ఎక్కువగా ఇచ్చే రకమైతే రూ.1-2 లక్షలు ఉంటుంది. అయితే ఒంగోలు/నెల్లూరు బ్రీడ్‌కు చెందిన వయాటినా-19 అనే ఆవు జ్రెజిల్‌లో నిర్వహించిన వేలంలో ఏకంగా రూ.41 కోట్లకు అమ్ముడైంది. దీంతో గతంలో ఉన్న రికార్డులన్నీ బ్రేకయ్యాయి. కాగా 1800sలో ఒంగోలు ఆవును బ్రెజిల్‌కు తీసుకెళ్లారు. అక్కడ అనేక జెనెటిక్ మార్పులతో ప్రాచుర్యం పొందింది. వయాటినా-19 బరువు ఏకంగా 1,101kgలు.

error: Content is protected !!