News December 26, 2025

విజయవాడ రైల్వేస్టేషన్ విస్తరణ లేనట్లే..!

image

విజయవాడ రైల్వేస్టేషన్‌ను రూ.650 కోట్లతో అంతర్జాతీయ స్థాయికి తీర్చిదిద్దే పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. షాపింగ్ మాల్స్, లిఫ్టులు, ఎస్కలేటర్లతో ఆధునీకరించినప్పటికీ, ప్రస్తుతం ఉన్న 10 ప్లాట్‌ఫారమ్‌లనే కొనసాగించనున్నారు. కొత్తగా ప్లాట్‌ఫారమ్‌లు పెరుగుతాయని ఆశించిన ప్రయాణీకులకు ఇది కొంత నిరాశ కలిగించే విషయమే. విజయవాడకు ప్రత్యామ్నాయంగా రాయనపాడు, గుణదల స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నారు.

Similar News

News January 5, 2026

చలి తీవ్రతతో కోళ్లకు పెరుగుతున్న ముప్పు

image

చలి గాలులు, పొగ మంచు వల్ల రాత్రి వేళ కోళ్ల షెడ్లలో తేమ అధికమై అది ఆవిరి కాకుండా ఉండిపోతుంది. దీని వల్ల కోళ్లలో శ్వాస సంబంధ వ్యాధుల ముప్పు, లిట్టర్‌లో తేమ శాతం పెరగడం వల్ల పరాన్నజీవులు, శిలీంధ్రాల బెడద పెరుగుతుంది. చలికి కోళ్లు ఒత్తిడికి లోనవడం వల్ల వాటిలో వ్యాధి నిరోధకత శక్తి తగ్గి CRD, ఐబీ, కొక్కెర రోగం, బ్రూడర్ న్యుమోనియా, కోకిడియోసిస్ వ్యాధుల ముప్పు పెరిగి కోళ్ల మరణాలకు కారణమయ్యే ప్రమాదం ఉంది.

News January 5, 2026

సూర్యాపేట: ట్యాంకర్ ఢీకొని అసిస్టెంట్ మేనేజర్ మృతి

image

తిరుమలగిరి మండలం తొండ గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో యూనియన్ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ సతీష్ (45) దుర్మరణం చెందారు. తన స్వగ్రామం ఐనోలు నుంచి వస్తుండగా, ఎదురుగా వచ్చిన పెట్రోల్ ట్యాంకర్ లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News January 5, 2026

నీళ్లు వృథా కాకుండా ఎవరైనా వాడుకోవచ్చు: సీఎం చంద్రబాబు

image

AP: ఏటా కృష్ణా, గోదావరి నుంచి వేల టీఎంసీలు వృథాగా సముద్రంలో కలుస్తున్నాయని తెలుగు మహా సభలో సీఎం చంద్రబాబు తెెలిపారు. అందుకే ఉమ్మడి ఏపీలోనూ ఎన్నో ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టామని వెల్లడించారు. ఇప్పుడూ నీళ్లు వృథా కాకుండా ఎవరు వాడుకున్నా ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. ఇక నదుల అనుసంధానంతో దేశంలో నీటి సమస్య లేకుండా చేయాలని సీఎం చెప్పారు. గంగా-కావేరీ, గోదావరి-పెన్నా నదులు కలవాలన్నారు.