News December 26, 2025

చీరాల: మద్యం మత్తులో ASI రచ్చ.. SP ఆగ్రహం

image

చీరాలలో మద్యం మత్తులో హల్చల్ సృష్టించిన వేటపాలెం ASI రవికుమార్‌పై తక్షణమే చర్యలు తీసుకుని వీఆర్‌కు పంపించినట్లు SP ఉమామహేశ్వర్ తెలిపారు. మద్యం మత్తులో పోలీసుల మధ్య జరిగిన ఘర్షణపై ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ సిబ్బంది క్రమశిక్షణకు మారుపేరని ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నామన్నారు. ఇటువంటి ఘటనలకు పాల్పడితే సిబ్బందిపై శాఖా పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Similar News

News January 12, 2026

WPL: ఈరోజు RCB vs UPW మ్యాచ్

image

WPLలో భాగంగా నేడు RCB, యూపీ వారియర్స్ తలపడనున్నాయి. RCB తొలి మ్యాచ్‌లో MIపై థ్రిల్లింగ్ విక్టరీ సాధించి జోరుమీద ఉంది. ఇక UPW తన మొదటి మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్‌ చేతిలో ఓడిపోయింది. దీంతో ఈ సారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉంది. ఇప్పటి వరకూ ఇరు జట్లు హెడ్‌ టు హెడ్ ఆరు సార్లు తలపడగా చెరో మూడు మ్యాచ్‌లు గెలిచాయి. రాత్రి 7:30 నుంచి హాట్‌స్టార్, స్టార్ స్పోర్ట్స్‌లో లైవ్ చూడవచ్చు.

News January 12, 2026

“ది గ్లోరీ ఆఫ్ మేడారం” పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి సీతక్క

image

సమాచార పౌర సంబంధాల శాఖ జాయింట్ డైరెక్టర్, పూర్వ వరంగల్ డీపీఆర్ఓ కన్నెగంటి వెంకటరమణ రచించిన “సమ్మక్క.. ది గ్లోరీ ఆఫ్ మేడారం” పుస్తకాన్ని రాష్ట్ర మంత్రి సీతక్క ఆవిష్కరించారు. మేడారంలో ఈ కార్యక్రమం జరిగింది. మేడారం ప్రాశస్త్యం, వనదేవతల గొప్పతనం, ఆదివాసీల సంప్రదాయం, గడిచిన ఇన్నేళ్లలో మేడారంలో జరిగిన మార్పులు- అభివృద్ధి వంటి సకల సమాచారంతో పుస్తకాన్ని రూపొందించడం పట్ల మంత్రి అభినందించారు.

News January 12, 2026

పాపం శ్రీలీల.. బాలీవుడ్‌పైనే ఆశలు

image

ఒకే ఏడాది 8 సినిమాలతో సంచలనం సృష్టించిన శ్రీలీల చెప్పుకోదగ్గ హిట్లు లేక సతమతమవుతోంది. తెలుగులో గత ఏడాది చేసిన సినిమాలు ఆకట్టుకోలేదు. ఈ ఏడాది తమిళంలో ఎంట్రీ ఇచ్చారు. శివ కార్తికేయన్ సరసన నటించిన ‘పరాశక్తి’ మూవీ తాజాగా విడుదలై ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. దీంతో అమ్మడికి కోలీవుడ్‌లో ఆఫర్లు రావడం గగనమేనని తెలుస్తోంది. ఈ క్రమంలో కార్తీక్ ఆర్యన్‌తో నటిస్తున్న బాలీవుడ్ మూవీపైనే ఈ బ్యూటీ ఆశలు పెట్టుకున్నారు.