News December 26, 2025

BREAKING: తిరుపతి చేరుకున్న CM

image

జిల్లా పర్యటన నేపథ్యంలో CM చంద్రబాబు శుక్రవారం తిరుపతికి చేరుకున్నారు. హెలీకాప్టర్‌లో SV అగ్రికల్చర్ యునివర్సిటీకి వచ్చిన ఆయనకు కలెక్టర్ వెంకటేశ్వర్, SP సుబ్బారాయుడు స్వాగతం పలికారు. అనంతరం CM భారతీయ విజ్ఞాన సమ్మేళనం సదస్సుకు హాజరుకానున్నారు.

Similar News

News January 9, 2026

ఖమ్మం: సంక్రాంతి వేళ తస్మాత్ జాగ్రత్త: సీపీ

image

సంక్రాంతి సెలవులకు ఊరెళ్లే వారు ఇళ్ల భద్రతపై అప్రమత్తంగా ఉండాలని ఖమ్మం సీపీ సునీల్ దత్ సూచించారు. నగలు బ్యాంక్ లాకర్లలో ఉంచాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. ఎక్కువ రోజులు తాళం వేసి వెళ్లే వారు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని, అనుమానితులు కనిపిస్తే డయల్ 100కు కాల్ చేయాలని తెలిపారు. ప్రయాణాల్లో ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఆయన కోరారు.

News January 9, 2026

ఖమ్మం జిల్లాలో పునఃప్రారంభమైన వ్యవసాయ యాంత్రీకరణ!

image

పదేళ్ల విరామం తర్వాత ప్రభుత్వం వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని పునఃప్రారంభించింది. 2025-26కు గాను ఖమ్మం జిల్లాకు రూ.4.37 కోట్ల రాయితీ నిధులను కేటాయించారు. ఎస్సీ, ఎస్టీలకు 50%, ఇతరులకు 40% రాయితీతో యంత్రాలు అందించనున్నారు. ఇప్పటికే 387 మంది రైతులు డీడీలు చెల్లించగా, తొలి విడతలో 172 యూనిట్లను త్వరలోనే పంపిణీ చేయనున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య తెలిపారు.

News January 9, 2026

నిర్మల్: గడువులోగా పిల్లలను ఇంటికి తీసుకెళ్లండి: డీఈవో

image

నిర్మల్ జిల్లా పరిధిలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను సంక్రాంతి సెలవుల్లో భాగంగా శుక్రవారం నుంచి ఇండ్లకు పంపించడం జరుగుతుందని డీఈవో భోజన్న తెలిపారు. ఉ.10 నుంచి సా.5 వరకు విద్యార్థులను ఇంటికి పంపించడం జరుగుతుందన్నారు. పేరెంట్స్ తప్పకుండా వచ్చి తమ పిల్లలను తీసుకువెళ్లాలని సూచించారు. సెలవులు ముగిసిన వెంటనే పిల్లలను పాఠశాలకు పంపాలని అన్నారు.