News December 26, 2025
జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ అధికారిగా డాక్టర్ నరేశ్

బాపట్ల జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ అధికారిగా డాక్టర్ సీహెచ్. నరేశ్ కుమార్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ముందుగా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ను ఆయన మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందించారు. అనంతరం సంబంధితశాఖ కార్యాలయానికి వెళ్లి బాధ్యతలు స్వీకరించారు. కార్యాలయంలోని అధికారులు, సిబ్బంది ఆయనకు అభినందనలు తెలిపారు.
Similar News
News December 29, 2025
ములుగు జిల్లాలో మరోసారి పెద్దపులి కలకలం

ములుగు జిల్లాలో మరోసారి పెద్దపులి కలకలం రేపుతోంది. భూపాలపల్లి అడవి నుంచి ఆదివారం రాత్రి జాకారం వద్ద రోడ్డు దాటుతుండగా అంబులెన్స్ డ్రైవర్ గుర్తించి అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. పంది కుంట నర్సరీలోకి వెళ్లి కంచె దాటే క్రమంలో స్తంభం విరిగినట్లు అధికారులు నిర్ధారించారు. అక్కడ పులి అడుగులను గుర్తించారు. భూపాల్ నగర్, జాకారం, శ్రీనగర్, రామచంద్రాపురం వాసులు అడవుల్లోకి వెళ్లవద్దని హెచ్చరించారు.
News December 29, 2025
నిర్మల్ జిల్లాలో యూరియా కొరత లేదు: కలెక్టర్

జిల్లాలో యూరియా కొరత లేదని, రైతులు ఆందోళన చెందవద్దని కలెక్టర్ అభిలాష అభినవ్ స్పష్టం చేశారు. ప్రస్తుతం 8 వేల మెట్రిక్ టన్నుల నిల్వలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని వ్యాపారులను హెచ్చరించారు. సరఫరా తీరుపై అధికారులతో సమీక్షించిన ఆమె, అవసరానికి అనుగుణంగా నిల్వలు ఉన్నాయని, రైతులు ధీమాగా ఉండాలని ప్రకటనలో పేర్కొన్నారు.
News December 29, 2025
సిరిసిల్ల: రాజీవ్ యువ వికాసం.. అందని ద్రాక్షేనా..!

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీకి చెందిన నిరుద్యోగ యువతను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఈ ఏడాది ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని తీసుకొచ్చింది. సిరిసిల్ల జిల్లాలో 23,477 మంది యువత ఈ పథకానికి దరఖాస్తు చేసుకోగా, యూనిట్ల కేటాయింపునకు కసరత్తు పూర్తయింది. కాగా, రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు రుణాలు అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అది ప్రకటనకు మాత్రమే పరిమితమై యువతకు అందని ద్రాక్షగానే మిగిలింది.


