News December 26, 2025

SKLM: రథసప్తమి ఉత్సవాలపై ప్రజాభిప్రాయ సేకరణ

image

రథసప్తమి ఉత్సవాలపై ఈనెల 27వ తేదీన ప్రజాభిప్రాయ సేకరణ ఉంటుందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శుక్రవారం తెలిపారు. ప్రజాభిప్రాయ సేకరణ సభ శనివారం (ఈనెల 27) సాయంత్రం 4 గంటలకు శ్రీకాకుళం నగరంలోని జెడ్పీ మందిరంలో నిర్వహించబడునని పేర్కొన్నారు. ఈ సమావేశానికి ప్రజా ప్రతినిధులు, స్థానిక ప్రముఖులు, ఆలయ సంప్రదాయాలను అవగాహన కలిగిన పెద్దలు హాజరుకావాలని వెల్లడించారు.

Similar News

News January 1, 2026

‘శ్రీకాకుళం జిల్లాలో ఉపాధి వేతనదారులకు రూ.322 కోట్లు చెల్లించాం’

image

జిల్లాలో గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా ఉపాధి వేతనదారులకు ఇప్పటివరకు ఆర్థిక సంవత్సరంలో రూ.322 కోట్ల చెల్లించడం జరిగిందని డ్వామా పీడీ లవరాజు తెలిపారు. బుధవారం సాయంత్రం జలుమూరులోని స్థానిక కార్యాలయంలో క్షేత్ర సహాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. వేతనదారులకు మరో రూ.14 కోట్ల బకాయిలు ఉన్నాయన్నారు. ఇప్పటివరకు కోటి 36 లక్షల పది దినాలు పూర్తి అయ్యాయని పేర్కొన్నారు.

News January 1, 2026

2026ను స్వాగతించి..శుభాకాంక్షలు చెప్పిన ఇసుక కళాఖండం

image

ఎల్.ఎన్.పేట మండలం లక్ష్మీనర్సుపేట గ్రామానికి చెందిన ప్రముఖ సైకత శిల్పి ప్రసాద్ మిశ్రా వంశధార నది తీరంలో బుధవారం రూపొందించిన సైకత శిల్పం ఎంతగానో ఆకట్టుకుంటుంది. జనవరి ఒకటో తేదీ నూతన సంవత్సరాన్ని స్వాగతిస్తూ 2026 ఆకృతిలో తీర్చిదిద్దిన కళారూపం చూపరులను కట్టిపడేసింది. కొత్త సంవత్సరంలో అన్ని వర్గాలకు మంచి జరగాలని ఈ ఇసుక కళాఖండంతో ఆయన ఆకాంక్షించారు.

News December 31, 2025

శ్రీకాకుళం: ఈ రైడ్ సేఫేనా?

image

చోదకులు హెల్మెట్ ధరించక యాక్సిడెంట్‌ల్లో ప్రాణాలొదిలిన ఘటనలు శ్రీకాకుళం జిల్లాలో తరచూ జరగుతుంటాయి. హెల్మెట్ ఆవశ్యకతను తెలియజేస్తూ పోలీసులు అవగాహన కల్పించినా..పెడచెవిన పెట్టి మృత్యువాత పడుతున్నారు. మరి కొందరు హెల్మెట్ ఉన్నా..బైకులు పక్కన పెట్టి డ్రైవింగ్ చేయడం శ్రీకాకుళం పట్టణంలో ఇవాళ కనిపించింది. పోలీసులు, ఫైన్‌ల నుంచి తప్పించుకోవడానికి తప్ప, వ్యక్తిగత భద్రతకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.