News December 26, 2025
నాగర్ కర్నూల్: కవిత పర్యటన వివరాలు

ఎమ్మెల్సీ కవిత శనివారం నాగర్‌కర్నూల్ జిల్లాలో విస్తృతంగా పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ఏలూరు పంప్ హౌస్‌ను సందర్శిస్తారు. అనంతరం 11 గంటలకు పెంట్లవెల్లిలో రుణమాఫీ కాని రైతుల ఇబ్బందులను అడిగి తెలుసుకోనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి మెడికల్ కాలేజ్, వట్టెం రిజర్వాయర్, సిర్సవాడ బ్రిడ్జి పనులను పరిశీలించనున్నారు. కవిత పర్యటన నేపథ్యంలో పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశాయి.
Similar News
News December 31, 2025
సంగారెడ్డి: రేపటి నుంచి రోడ్డు భద్రత మాసోత్సవాలు: కలెక్టర్

సంగారెడ్డి జిల్లాలో జనవరి 1 నుంచి 31 వరకు రోడ్డు భద్రత మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ప్రావీణ్య బుధవారం తెలిపారు. హెవీ వెహికిల్స్, ఆటో డ్రైవర్లకు ఆరోగ్య, కంటి పరీక్షల నిర్వహణకు క్యాంపులను ఏర్పాటు చేయనున్నట్లు, పాఠశాలల మేనేజ్మెంట్‌కు పాఠశాలల బస్సుల సేఫ్టీపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారని చెప్పారు.
News December 31, 2025
అమ్మాయిలూ.. కడుపునొప్పి వస్తోందా?

స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఫెలోపియన్ ట్యూబ్స్ కీలక పాత్ర పోషిస్తాయి. అండాశయం నుంచి అండాలను గర్భాశయానికి పంపించడంలో ఇవి ఉపయోగపడతాయి. అయితే వీటిలో అడ్డంకులు ఏర్పడినపుడు తీవ్ర కడుపునొప్పితో బాధపడుతుంటారు. దీన్ని హైడ్రోసాల్పిన్క్స్ అంటారు. మూత్ర విసర్జన సమయంలో మంట, ఋతుస్రావం సమయంలో నొప్పి ఇవన్నీ హైడ్రోసాల్పింక్స్ లక్షణాలు. కొన్నిసార్లు ఇది సంతానలేమికి దారి తీయొచ్చంటున్నారు నిపుణులు.
News December 31, 2025
హైడ్రోసాల్పిన్స్క్‌కి కారణాలు

క్లామిడియా, గోనేరియా మొదలైన కొన్ని లైంగిక సంక్రమణ వ్యాధులు (STDలు) హైడ్రోసాల్పిన్క్స్ వంటి వ్యాధులకు కారణమవుతాయి. అలాగే క్షయ వ్యాధి, గతంలో ఫెలోపియన్ ట్యూబ్‌ల శస్త్రచికిత్స, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ చికిత్స తీసుకున్నా ఈ సమస్య రావొచ్చంటున్నారు నిపుణులు. ఈ సమస్య ఉన్నవారికి ప్రెగ్నెన్సీ కోసం IVF సిఫార్సు చేస్తారు. హైడ్రోసాల్పిన్క్స్‌ను అల్ట్రాసౌండ్, ఇతర ఇమేజింగ్ పద్ధతులను ఉపయోగించి నిర్ధారణ చేస్తారు.


