News December 26, 2025

కలెక్టరేట్లో ప్రత్యేక పీజీఆర్ఎస్: కలెక్టర్

image

ఎస్సీ, ఎస్టీల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక పీజీఆర్ఎస్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్లా తెలిపారు. ఇందులో భాగంగా కలెక్టరేట్లో శనివారం 10 గంటలకు పీజీఆర్ఎస్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కారం పొందేందుకు ఈ వేదికను వినియోగించుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.

Similar News

News December 27, 2025

కృష్ణా: మామ చేతిలో అల్లుడు దారుణ హత్య.!

image

తోట్లవల్లూరు మండలం పెనమకూరులో మామ చేతిలో అల్లుడు దారుణ హత్యకు గురయ్యాడు. మద్యం మత్తులో మాటా మాటా పెరగడంతో మామ చీకుర్తి శ్రీనివాసరావు కర్రతో కొట్టగా అల్లుడు ఆదిమూలపు సురేశ్ (31) తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సురేశ్ మృతి చెందాడు. లారీ డ్రైవర్‌గా పనిచేస్తూ భార్యతో విజయవాడలో నివసించేవాడు. ఇటీవల కుమార్తె మృతి నేపథ్యంలో వివాదం చెలరేగినట్లు పోలీసులు తెలిపారు.

News December 27, 2025

అప్పుడు లేచిన నోళ్లు.. ఇప్పుడు లేవట్లేదే?

image

క్రికెట్‌లో భారత్ అనగానే ఒంటికాలి మీద వచ్చేవాళ్లు చాలామందే ఉన్నారు. మన పిచ్‌ల వల్ల టెస్ట్ క్రికెట్ చచ్చిపోతోందని నోటికొచ్చిన మాటలన్నారు. అలాంటి వాళ్లు AUS పిచ్‌లపై నోరు మెదపకపోవడం ఆశ్చర్యం. ప్రస్తుత యాషెస్ సిరీస్‌లో NOV 21న పెర్త్‌లో తొలి టెస్ట్, ఇవాళ మెల్‌బోర్న్‌లో 4వ మ్యాచ్ కేవలం రెండ్రోజుల్లోనే ముగిశాయి. మన పిచ్‌లను క్రికెట్‌కు ప్రమాదంగా అభివర్ణించినవాళ్లు ఇప్పుడు మూగబోవడం వింతగా ఉంది.

News December 27, 2025

VKB: జిల్లా వ్యాప్తంగా కిటకిటలాడుతున్న గ్రంథాలయాలు

image

తెలంగాణ ప్రభుత్వం నిర్వహించే టెట్ పరీక్షకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ అభ్యర్థుల్లో గుబులు పుడుతోంది. దీంతో అభ్యర్థులు వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న గ్రంథాలయాలకు పోటెత్తారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రభుత్వ టీచర్‌లకు టెట్ అర్హత తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారీ సంఖ్యలో ఉపాధ్యాయులు టెట్ పరీక్ష రాయనున్నారు. జనవరి 3 నుంచి పరీక్షలు జరుగుతాయి.