News December 26, 2025

HYDలో తొలిసారిగా రిమోట్ కంట్రోల్డ్ రూఫ్!

image

పాతబస్తీలోని అలావా-ఏ-బీబీ వద్ద దేశంలోనే అరుదైన, సిటీలో మొట్టమొదటి ‘రిమోట్ కంట్రోల్డ్ రిట్రాక్టబుల్ రూఫ్’ రాబోతోంది. సుమారు రూ.1.20 కోట్లతో GHMC ఈ భారీ ప్రాజెక్టును చేపట్టనుంది. మొహర్రం వేడుకలప్పుడు ఎండ, వానల వల్ల భక్తులు పడే ఇబ్బందులకు ఇక చెక్ పడనుంది. ఒకే ఒక్క రిమోట్ బటన్‌తో 4,844 చదరపు అడుగుల భారీ పైకప్పు క్షణాల్లో తెరుచుకుంటుంది లేదా మూసుకుంటుంది. సిటీలో ఇలాంటి ప్రయోగం జరగడం ఇదే తొలిసారి.

Similar News

News December 28, 2025

న్యూ ఇయర్ నుంచే నుమాయిష్

image

నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో నుమాయిష్ న్యూ ఇయర్ రోజే ప్రారంభం కానుంది. 85వ ఎడిషన్‌ JAN 1 నుంచి FEB 15 వరకు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరగనుంది. ముఖ్య అతిథిలుగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరై ప్రారంభిస్తారు. ఈ సారి ఎగ్జిబిషన్‌లో 1050 స్టాళ్లు ఉంటాయి. 4PM నుంచి 10:30PM వరకు తెరిచి ఉంటుంది. ఎంట్రీ టికెట్ ధర రూ.50గా నిర్ణయించారు. 5 ఏళ్ల లోపు పిల్లలకు FREE.

News December 28, 2025

గచ్చిబౌలికి గుడ్ బై.. ‘ఫ్యూచర్’ ఈ ఏరియాలదే!

image

మూసీ ప్రక్షాళన ప్లాన్‌లో భాగంగా ఉప్పల్, బాపుఘాట్ ఏరియాలు హాట్ కేకుల్లా మారబోతున్నాయి. 50-60 అంతస్తుల బిల్డింగ్స్‌కు ప్రభుత్వం రూట్ క్లియర్ చేస్తోంది. అసలు పాయింట్ ఏంటంటే.. పూర్తి స్థాయి డీపీఆర్ (DPR) ఇంకా అందరికీ అందుబాటులోకి రాకపోయినా, తెర వెనుక పని జోరుగా సాగుతోంది. రూ.400 కోట్లతో బ్రిడ్జ్-కమ్-బ్యారేజ్‌ల ప్లాన్ దాదాపు ఖరారైంది. ఇందుకోసం నిధుల సర్దుబాటు, గ్రౌండ్ వర్క్ వేగంగా జరుగుతోంది.

News December 28, 2025

హైదరాబాద్ కుర్రాడే హిమాలయ శిఖరం!

image

ఒక్కసారి ఊహించుకోండి.. 16 ఏళ్ల వయసులో మనం ఏం చేస్తాం? కానీ మన హైదరాబాద్ కుర్రాడు విశ్వనాథ్ కార్తికేయ మాత్రం ఏకంగా ప్రపంచాన్నే తన పాదాక్రాంతం చేసుకున్నాడు. ఏడు ఖండాల్లోని ఎత్తైన శిఖరాలను అధిరోహించి (7 Summits Challenge), ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ 2025’ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకున్నాడు. క్రమశిక్షణతో 2025 మే 27న ఎవరెస్టును ముద్దాడి ఈ ఘనత సాధించాడు.