News December 26, 2025
అనంతపురంలో తుపాకుల సరఫరా గ్యాంగ్ అరెస్ట్

అనంతపురంలో తుపాకులు సరఫరా చేస్తున్న మధ్యప్రదేశ్‌కు చెందిన ముఠాను అరెస్ట్ చేసినట్లు SP జగదీశ్ వెల్లడించారు. ముగ్గురు సభ్యులను అదుపులోకి తీసుకుని, వారి నుంచి 5 రివాల్వర్లు, 30 బుల్లెట్లు, ఒక తల్వార్ స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఇటీవల భార్యను తుపాకీతో బెదిరించిన భర్తపై వచ్చిన ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులకు ఈ ముఠా గుట్టు చిక్కింది. నిందితులపై కేసు నమోదు చేసి తదుపరి విచారణ జరుపుతున్నారు.
Similar News
News December 31, 2025
కామారెడ్డి: యూరియా కొరత లేదు: జిల్లా వ్యవసాయ అధికారి

జంగంపల్లి సొసైటీలో యూరియా పంపిణీపై DAO మోహన్ రెడ్డి స్పందించారు. DEC 31న జంగంపల్లి సొసైటీ పరిధిలో 552 మంది రైతులకు 1,340 బస్తాల యూరియాను పంపిణీ చేశామని తెలిపారు. ఎక్కడా ఎరువుల కొరత లేదని, వచ్చిన రైతులందరికీ యూరియా అందజేశామని పేర్కొన్నారు. రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని, ఇప్పటికే పంపిణీ చేసిన నిల్వలకు అధనంగా మరో 1,333 బస్తాల యూరియాను కూడా సొసైటీకి పంపినట్లు ఆయన వెల్లడించారు.
News December 31, 2025
NEW YEAR సెలబ్రేషన్స్.. వరంగల్‌లో హైదరాబాద్ కల్చర్..!

వరంగల్‌కు మెట్రో కల్చర్ వచ్చింది. ఎప్పుడూ లేని విధంగా మొదటిసారి త్రినగరిలో హైదరాబాద్ తరహాలో మందు, విందు, డీజే మ్యూజిక్.. పేరొందిన సినీ సింగర్‌లతో న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించడానికి ఈవెంట్ సంస్థలు ఏర్పాట్లు చేశాయి. వరంగల్ రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న ఎంకే నాయుడు, హంటర్ రోడ్డు డీ కన్వెన్షన్, భద్రకాళి బండ్, బీఎస్‌కే గ్రౌండ్, హనుమకొండలోని పలు హోటల్లో న్యూ ఇయర్ వేడుకలు జరగనున్నాయి.
News December 31, 2025
NZB: అందరికీ విజయాలు కలగాలి: సీపీ

ప్రజలందరూ శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలుగకుండా పోలీసులకు సహకరిస్తూ నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకోవాలని సీపీ సాయి చైతన్య తెలిపారు. నిజామాబాద్ ప్రజలందరూ ఎలాంటి అభద్రతాభావంతో లేకుండా సుఖశాంతులతో ఉండాలని పోలీస్ శాఖ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ నూతన సంవత్సరంలో అందరికీ విజయాలు కలగాలన్నారు.


