News December 26, 2025

వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.. వాడపల్లికి 4 వరుసల రోడ్డు!

image

వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయానికి వెళ్లే రహదారిని 4వరుసలుగా విస్తరించేందుకు కార్యాచరణ సిద్ధం చేసినట్లు కలెక్టర్ మహేశ్ కుమార్ తెలిపారు. శుక్రవారం అధికారులతో నిర్వహించిన సమావేశంలో రోడ్డు నిర్మాణానికి అవసరమైన భూసేకరణపై సుదీర్ఘంగా చర్చించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఈ ఆధునిక రహదారిని నిర్మించనున్నట్లు పేర్కొన్నారు.

Similar News

News December 28, 2025

వరి మాగాణుల్లో మినుము, పెసర ఎప్పుడు వెదజల్లాలి?

image

ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా ప్రాంతాల్లో వరి కోయడానికి వారం, 10 రోజుల ముందు నుంచి బురద పదునులో మినుము మరియు పెసర లాంటి పప్పుజాతి పైర్ల విత్తనాలను శుద్ధి చేసి సమానంగా వెదజల్లుకోవాలి. పెసర అయితే ఎకరానికి 10 నుంచి 12 కిలోల విత్తనాలు, మినుములు ఎకరానికి 16 నుంచి 18 కిలోల విత్తనాలు అవసరమవుతాయి. తెగుళ్ల నుంచి రక్షణకు కిలో విత్తనానికి 30 గ్రాముల కార్బోసల్ఫాన్ పొడిమందును పట్టించి విత్తనశుద్ధి చేసుకోవాలి.

News December 28, 2025

జనవరి 3న కొండగట్టుకు పవన్

image

TG: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనవరి 3న జగిత్యాల జిల్లాలోని కొండగట్టుకు రానున్నారు. అక్కడి ఆంజనేయస్వామి ఆలయ పరిసరాల్లో <<18636046>>టీటీడీ రూ.35.19 కోట్లతో<<>> నిర్మించనున్న ధర్మశాల నిర్మాణానికి భూమిపూజ చేయనున్నారు. ఇందుకోసం ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తుల వసతి కోసం 100 గదులతో భారీ సత్రాన్ని నిర్మించనున్నారు.

News December 28, 2025

ఏడవ నేర్చిన వ్యవసాయము

image

ఒక పనిని ఇష్టం లేకుండా, అయిష్టంగా లేదా ఏడుస్తూ చేస్తే అది ఎప్పటికీ విజయవంతం కాదు. వ్యవసాయం వంటి శ్రమతో కూడిన పనులను ఎంతో ఉత్సాహంతో, అంకితభావంతో చేయాలి. అలా కాకుండా “ఏడుస్తూ” లేదా అయిష్టంగా చేస్తే, ఆ పంట సరిగా పండదు, పైగా అది నష్టాలకే దారితీస్తుంది. ఎవరైనా ఒక పనిని అయిష్టంగా చేస్తే దాని వల్ల ప్రయోజనం లేదని తెలిపే సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తారు.