News December 26, 2025

జగన్ బెదిరింపులకు భయపడే వారు లేరు: మంత్రి సవిత

image

పీపీపీ మోడల్‌లో మెడికల్ కళాశాలల నిర్మాణానికి వచ్చే కాంట్రాక్టర్లను జైలుకు పంపిస్తామని వైసీపీ బెదిరించడంపై మంత్రి సవిత మండిపడ్డారు. శుక్రవారం పెనుకొండలో ఆమె మాట్లాడుతూ.. దౌర్జన్యాలతో అభివృద్ధిని అడ్డుకుంటే సహించేది లేదని హెచ్చరించారు. జగన్ బెదిరింపులకు భయపడే వారు ఎవరూ లేరని, రాష్ట్రాభివృద్ధికి ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

Similar News

News December 28, 2025

31న డెలివరీ బాయ్స్ సమ్మె.. డిమాండ్స్ ఇవే!

image

గిగ్ వర్కర్లు ఈ నెల 31న దేశవ్యాప్తంగా <<18668798>>సమ్మెకు<<>> సిద్ధమవుతున్నారు. స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ యాప్స్ డెలివరీ బాయ్స్ సర్వీసులు ఆపేయనున్నారు. వారి డిమాండ్స్ ఇవే.. పారదర్శక, న్యాయమైన వేతన చెల్లింపులు. *10 నిమిషాల డెలివరీ మోడల్‌ను విత్ డ్రా చేసుకోవాలి. *సరైన ప్రాసెస్ లేకుండా అకౌంట్ బ్లాక్ చేయడం ఆపేయాలి. *మెరుగైన ప్రమాద బీమా కల్పించాలి. *హామీ ఇచ్చిన మేరకు పని కేటాయించాలి.

News December 28, 2025

ప.గో: మానని గాయం.. వీడని శోకం

image

ఉమ్మడి ప.గో జిల్లాను 2025లో వరుస విషాదాలు కుదిపేశాయి. మార్చిలో తాడేపల్లిగూడెం సమీపాన కారు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఆగస్టులో గోదావరి వరదలు పోలవరం, ఏలూరును అతలాకుతలం చేశాయి. అక్టోబరులో ‘మొంథా’ తుఫాను భీమవరం పరిసరాల్లో అపార నష్టాన్ని మిగిల్చింది. ఇక డిసెంబరులో పోలమూరు, సూరప్పగూడెం వద్ద జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురు యువకులు దుర్మరణం చెందారు.

News December 28, 2025

14వ స్థానంలో కర్నూలు జిల్లా.!

image

అన్ని పోలింగ్ కేంద్రాలకు రాజకీయ పార్టీలు బూత్ లెవెల్ ఏజెంట్లను తక్షణమే నియమించుకోవాలని కర్నూలు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిరి శనివారం ఆదేశించారు. ఓటర్ల జాబితా సవరణలో BLOలతో సమన్వయంగా పనిచేయాలని సూచించారు. ఓటర్ల మ్యాపింగ్‌లో జిల్లా రాష్ట్రంలో 14వ స్థానంలో ఉందని, జనవరి చివరికి గ్రామాల్లో 75%, పట్టణాల్లో 85% మ్యాపింగ్ పూర్తిచేస్తామన్నారు. నిర్లక్ష్యం వహించిన ఇద్దరు BLOలను సస్పెండ్ చేశామన్నారు.