News December 26, 2025
కలెక్టర్, ఎస్పీతో సమావేశమైన బాపట్ల ఎంపీ

లోక్‌సభ ప్యానల్ స్పీకర్, బాపట్ల పార్లమెంట్ సభ్యుడు తెన్నేటి కృష్ణ ప్రసాద్ శుక్రవారం బాపట్ల కలెక్టరేట్ వద్ద కలెక్టర్ వినోద్ కుమార్, ఎస్పీ ఉమామహేశ్వర్‌తో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. జిల్లాలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులు, శాంతిభద్రతల పరిరక్షణపై ఎంపీ సుధీర్ఘంగా చర్చించారు. జిల్లా అభివృద్ధికి పాటుపడాలని సూచించారు.
Similar News
News January 1, 2026
NLG: పరీక్షల టైం టేబుల్ విడుదల

మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం పరిధిలో జరగబోయే LLB, (B.Com/B.A) రెగ్యులర్ సెమిస్టర్-1 సంబంధించిన ఎగ్జామ్స్ టైం టేబుల్‌ను గురువారం కంట్రోలర్ అఫ్ ఎగ్జామినేషన్ డా.ఉపేందర్ రెడ్డి విడుదల చేశారు. పరీక్షలు ఈ నెల 7 నుంచి 19 తేదీ మధ్య జరుగుతాయని ఆయన తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు కాలేజీ ఐడీ కార్డ్, హాల్ టిక్కెట్లతో పరీక్షా కేంద్రాలకు హాజరు కావాలని ఆయన సూచించారు.
News January 1, 2026
AMP: పరస్పర శుభాకాంక్షలు తెలుపుకున్న కలెక్టర్, ఎస్పీ

నూతన సంవత్సరం పురస్కరించుకొని అమలాపురంలో కలెక్టర్ మహేశ్ కుమార్‌ను ఎస్పీ రాహుల్ మీనా గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌కు ఎస్పీ పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టర్ కూడా ఎస్పీకి నూతన సంవత్సర అభినందనలు తెలియజేశారు. కొత్త ఏడాదిలో జిల్లా ప్రజలందరికీ అంతా మంచే జరగాలని, అభివృద్ధి పథంలో జిల్లా ముందుకు సాగాలని వారు ఆకాంక్షించారు.
News January 1, 2026
ఈ నెల 3న మల్లన్న వార్షిక ఆరుద్రోత్సవం

ఈ నెల 3న లోక కల్యాణార్థమై శ్రీశైలంలో శ్రీ స్వామివారికి వార్షిక ఆరుద్రోత్సవం నిర్వహించనున్నారు. ఆరుద్రోత్సవాన్ని ప్రతి నెలలో మాసోత్సవంగా నిర్వహిస్తుండగా, ధనుర్మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం రోజున మాత్రం వార్షిక ఆరుద్రోత్సవం నిర్వహిస్తారు. 2న రాత్రి 10 గంటల నుండి శ్రీస్వామివారికి మహాన్యాస పారాయణ, లింగోద్భవకాల ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, 3న నందివాహన సేవ, గ్రామోత్సవం జరిపిస్తారు.


