News December 26, 2025

ఆఫీసు కుర్చీలో నిద్రపోవడం అశుభమా?

image

ఆఫీసు కుర్చీని సింహాసనంలా భావించాలని పండితులు చెబుతున్నారు. విధి నిర్వహణలో ఆ కుర్చీపై నిద్రించడం తగదంటున్నారు. ‘ఇది వృత్తి పట్ల అగౌరవాన్ని సూచిస్తుంది. అలాగే ఆర్థిక నష్టాలు, అశుభ ఫలితాలను కలిగించే అవకాశముంది. ఇది ప్రగతిని అడ్డుకుని ప్రతికూల శక్తిని పెంచవచ్చు. మీకు అలసటగా ఉంటే నడవడం, ముఖం కడుక్కోవడం, విశ్రాంతి గదిలో రెస్ట్ తీసుకోవడం చేయాలి. కుర్చీలో నిద్రించడం కెరీర్‌కు మంచిది కాదు’ అంటున్నారు.

Similar News

News February 21, 2026

వసూల్ రాజా.. సుంకాలతో USకు భారీగా ఆదాయం

image

అధికారంలోకి వచ్చాక ప్రపంచ దేశాలపై ట్రంప్ భారీగా టారిఫ్‌లు విధిస్తున్నారు. కస్టమ్స్ డ్యూటీ, ఇతర పన్నులు, ఫీజుల ద్వారా 2025లో USకు ఏకంగా రూ.26 లక్షల కోట్ల ఆదాయం సమకూరింది. 2024తో పోలిస్తే ఇది మూడింతలు ఎక్కువ. అయితే ట్రంప్ సుంకాల ఎఫెక్ట్ అంతిమంగా ఆ దేశ ప్రజలపైనే పడుతోంది. ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై టారిఫ్స్ విధించడం వల్ల స్థానికంగా వాటి ధరలు పెరిగి వినియోగదారులపై భారం పెరుగుతోంది.

News February 21, 2026

ఏఐ మాయ.. ఐదేళ్లలో 80 కోట్ల ఉద్యోగాలు మాయం!

image

ఏఐ వినియోగం పెరుగుతున్న కొద్దీ జాబ్స్ పోతాయనే ఆందోళన ఎక్కువవుతోంది. ఇప్పటికే చాలా కంపెనీలు ఉద్యోగులను తగ్గించుకుంటున్నాయి. ఈ క్రమంలో ఏఐ వ్యవస్థలు, రోబోలతో భవిష్యత్తులో 90% ఉద్యోగాలు, ఉపాధికి కోత పడొచ్చని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఐదేళ్లలో 30 కోట్ల జాబ్స్ పోతాయని ఆర్థిక సేవల సంస్థ గోల్డ్‌మన్ శాక్స్ అంచనావేసింది. కానీ ఆ సంఖ్య 80 కోట్లకు పైనే అని కన్సల్టింగ్ సర్వీసుల కంపెనీ మెక్‌కిస్నీ చెప్పింది.

News February 21, 2026

T20 WC: సూపర్-8 ఫైట్ జరుగుతుందిలా..

image

లీగ్ దశ <<19197455>>ముగిసిన<<>> తర్వాత 2 గ్రూపుల్లో నాలుగేసి జట్లున్నాయి. ప్రతి గ్రూపులోని ఒక టీమ్ మిగిలిన మూడింటితో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. అలా ఈ స్టేజీ ముగిసేలోపు 2 గ్రూపుల్లో టాప్‌-2లో ఉండే 4 జట్లు సెమీస్ చేరుతాయి. భారత్.. SA, జింబాబ్వే, విండీస్‌తో ఆడనుంది. మరో గ్రూపులో న్యూజిలాండ్, పాకిస్థాన్, ఇంగ్లండ్, శ్రీలంక ఉన్నాయి. సెమీస్‌లో విజయం సాధించిన జట్టు ఫైనల్ చేరుతుంది. సూపర్-8 షెడ్యూల్ పైన ఇమేజ్‌లో చూడవచ్చు.