News April 24, 2024

హైదరాబాద్‌లో రూట్‌ MAP ఇదే!

image

రేపు HYDలో హనుమాన్ శోభాయాత్ర జరగనుంది. యాత్ర కొనసాగే‌ రూట్ మ్యాప్‌ను పోలీసులు విడుదల చేశారు. గౌలిగూడ రామమందిరం నుంచి ప్రారంభమై తాడ్‌బండ్ టెంపుల్‌ వరకు కొనసాగుతుంది. పుత్లీబౌలి, కోఠి, సుల్తాన్‌బజార్, కాచిగూడ, నారాయణగూడ, RTC X రోడ్స్‌, అశోక్‌నగర్, కవాడిగూడ, బన్సీలాల్‌పేట, బైబిల్‌హౌస్, ఉజ్జయిని టెంపుల్, ప్యారడైజ్‌ మీదుగా తాడ్‌బండ్‌కు చేరుకుంటుంది. రేపు 11.30AM నుంచి 8PM వరకు ఈ రూట్‌లో ఆంక్షలు ఉంటాయి.

Similar News

News September 12, 2025

HYD: BRO ట్రాఫిక్ ఉల్లంఘిస్తే మెసేజ్ చేయండి

image

సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ ఉల్లంఘన జరిగితే ఒక్క వాట్సాప్ మెసేజ్ చేస్తే చాలని పోలీసులు తెలిపారు. హెల్మెట్ ధరించకపోవడం, రాంగ్ రూట్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్ వంటి వాటిపై సైతం ఫిర్యాదు చేసే అవకాశం ఉందన్నారు. ఎలాంటి ట్రాఫిక్ ఉల్లంఘన జరిగినా.. 9490617346కు వాట్సప్ ద్వారా లొకేషన్, డిటైల్స్ ఎంటర్ చేసి, ఫొటోతో పంపాలన్నారు. ఓ వ్యక్తి ఇటీవల హెల్మెట్ ధరించకపోవడంపై అధికారులు స్పందించారు.

News September 12, 2025

ఆవిష్కరణలకు ప్రాధాన్యత ఇవ్వాలి: గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ

image

సైన్స్, టెక్నాలజీ రంగాలలో దేశం గ్లోబల్ లీడర్‌గా నిలవాలంటే పరిశోధన, నూతన ఆవిష్కరణలకు అనుకూలమైన వాతావరణం కల్పించాలని తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అన్నారు. హైదరాబాద్‌లోని CSIR–IICTలో జరిగిన ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్’ ఆరో ప్రాంతీయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. పరిశోధనల ప్రోత్సాహం దేశ ప్రగతికి ఎంతగానో తోడ్పడుతుందని వివరించారు.

News September 12, 2025

KCR పరిపాలన కోల్పోవడం దురదృష్టం: సబితారెడ్డి

image

KCR పరిపాలన కోల్పోవడం తెలంగాణ ప్రజల దురదృష్టం అని MLA సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురువారం షాబాద్‌లో మాజీ ZPTC అవినాశ్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ముఖ్య నాయకుల, కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఏ ఎన్నికలు వచ్చినా, ఎప్పుడు వచ్చినా విజయం BRS దే అని ధీమా వ్యక్తం చేశారు. RSప్రవీణ్ కుమార్, ఆంజనేయులు, కౌశిక్‌రెడ్డి, రాజేందర్ గౌడ్, ప్రభాకర్, శ్రీధర్ రెడ్డి, నరేందర్ ఉన్నారు.