News December 26, 2025
కామారెడ్డి: రైలు కిందపడి మేస్త్రి సూసైడ్

కామారెడ్డిలోని రైల్వే స్టేషన్ సమీపంలో <<18676085>>రైలు కిందపడి ఓ వ్యక్తి ఆత్మహత్య<<>> చేసుకున్నాడు. రైల్వే ఎస్సై లింబాద్రి తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాకు చెందిన తమ్మిశెట్టి కన్నయ్య(63) దేవగిరి ఎక్స్‌ప్రెస్ కిందపడి చనిపోయాడు. మృతుడు 30 ఏళ్లుగా కామారెడ్డిలో మేస్త్రి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Similar News
News January 20, 2026
ఏలూరు: వెబ్‌సైట్‌లో అభ్యర్థుల మెరిట్ లిస్టు

ఏలూరు జిల్లాలోని కుక్కునూరు, వేలేరులోని కస్తూరిబా బాలికల విద్యాలయాల్లో బోధ నేతర సిబ్బందికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల మెరిట్ లిస్టును https:///www.deoeluru.org వెబ్‌సైట్‌లో పొందుపరచడం జరిగిందని ఏపీసీ పంకజ్ కుమార్ మంగళవారం తెలిపారు. అభ్యంతరాలు ఉంటే ఈనెల 22లోగా రాతపూర్వకంగా సర్వ శిక్ష జిల్లా ప్రాజెక్ట్ కార్యాలయానికి పంపాలన్నారు. ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మబలికే దళారుల మాటలు నమ్మవద్దని హెచ్చరించారు.
News January 20, 2026
మహానంది: ముగ్గురు సస్పెన్షన్.. ఒకరు డిస్మిస్

మహానంది గిరిజన ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న 9వ తరగతి విద్యార్థి విజయ్ కుమార్ తీవ్రంగా గాయపడి మృతి చెందిన విషయం తెలిసిందే. అందులో భాగంగా విచారణ చేసిన ఉన్నతాధికారులు ఉపాధ్యాయుల నిర్లక్ష్యాన్ని గుర్తించి పాఠశాల హెచ్ఎంతో పాటు డిప్యూటీ వార్డెన్, మరో టీచర్‌ను సస్పెండ్ చేయడంతో పాటు ఒక సీఈఆర్టీని విధుల నుంచి పూర్తిగా తొలగిస్తూ ఐటీడీఏ పీవో శివప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు.
News January 20, 2026
కలియుగ విపత్తుల నుంచి రక్షణ పొందాలంటే..

‘కలి’ అంటే నీటిలో లీనమయ్యే యుగమని అర్థం. కలియుగ ప్రభావంతో అకాల వర్షాలు, ఆకస్మిక వరదలు సంభవించి జనజీవనం అతలాకుతలమవుతుంది. మనుషులు ప్రవాహాల్లో కొట్టుకుపోయేంత ప్రకృతి వైపరీత్యాలు ఈ కాలంలో సంభవిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ విపత్కర పరిస్థితుల నుంచి ఉపశమనం, మనశ్శాంతి పొందడానికి నిరంతర దైవధ్యానం, భగవంతుడి నామస్మరణ మాత్రమే ఏకైక మార్గమని శాస్త్రాలు సూచిస్తున్నాయి. భక్తి మార్గమే ఈ కలి దోషాలకు నివారణ.


