News December 26, 2025

భువనగిరి: అడిషనల్ కలెక్టర్ బదిలీ

image

యాదాద్రి భువనగిరి జిల్లా అదనపు కలెక్టర్(రెవెన్యూ) వీరారెడ్డి బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన్ను తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమించారు. వీరారెడ్డి సంవత్సరానికిపైగా భువనగిరిలో అదనపు కలెక్టర్‌గా పని చేశారు. భూ సమస్యల పరిష్కారంలో ఆయనకు విశేష అనుభవం ఉంది.

Similar News

News December 29, 2025

రైలు ప్రమాదం.. నిలిచిన రైళ్లు

image

ఎర్నాకుళం ఎక్స్‌ప్రెస్‌ <<18699122>>ప్రమాదం<<>>తో ఎలమంచిలి రైల్వే స్టేషన్‌లో పొగ దట్టంగా అలుముకుంది. దీంతో పలు రైళ్లు నిలిచిపోయాయి. విశాఖ నుంచి విజయవాడ వెళ్లే రైళ్లు ఆలస్యం కానున్నాయి. అనకాపల్లి, తుని, విశాఖ తదితర రైల్వే స్టేషన్లలో పలు ట్రైన్స్ నిలిచిపోయినట్లు తెలుస్తోంది. మరోవైపు రైల్వే సిబ్బంది తీవ్రంగా ప్రయత్నించి మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్లు సమాచారం. ప్రయాణికులు ప్రస్తుతం స్టేషన్‌లో ఉన్నారు.

News December 29, 2025

వైకుంఠ ఏకాదశి రోజున ఆ పని చేయకూడదు.. ఈరోజే చేసుకోండి!

image

రేపు వైకుంఠ ఏకాదశి. ఇది అతి పవిత్రమైన రోజు. విష్ణుమూర్తికి ప్రీతిపాత్రమైన ఈ పర్వదినాన తులసి ఆకులను కోయడం నిషిద్ధం. తులసి కోటను ముట్టడం, ఆకులు తెంపడం మంచిది కాదు. అందుకే స్వామికి రేపు సమర్పించాల్సిన తులసి దళాలను ఈరోజే కోసి సిద్ధం చేసుకోండి. తులసి ఎప్పుడు తెంపినా వాటి పవిత్రత తగ్గదు. నిశ్చింతగా పూజకు వాడుకోవచ్చు. నియమాలు పాటిస్తూ భక్తితో ఆ శ్రీహరిని స్మరించి, అర్చించి మోక్షాన్ని పొందండి.

News December 29, 2025

భార్య సూసైడ్.. వెయ్యి కిలోమీటర్లు పారిపోయి..

image

బెంగళూరులో కొత్త జంట ఒకరి తర్వాత ఒకరు సూసైడ్ చేసుకోవడం కలకలం రేపింది. సూరజ్ శివన్న(35), గన్వీ(25) ఇటీవల పెళ్లి చేసుకున్నారు. ఈ క్రమంలో గన్వీ ఆత్మహత్య చేసుకోగా, పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో 1000KM దూరంలోని నాగ్‌పూర్(MH)కు సూరజ్, అతడి తల్లి పారిపోయారు. ఒత్తిడి తట్టుకోలేక సూరజ్ ఉరేసుకున్నాడు. అతడి తల్లి ఆత్మహత్యకు యత్నించింది. అత్తింటి వేధింపులతోనే గన్వీ చనిపోయిందని ఫ్యామిలీ ఆరోపిస్తోంది.