News December 26, 2025

డబుల్ ఇంజిన్ సర్కారుతోనే రాష్ట్రాభివృద్ధి: కిషన్ రెడ్డి

image

TG: డబుల్ ఇంజిన్ సర్కారు వస్తేనే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కేంద్ర నిధులతోనే అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పారు. పదేళ్లలో 2 ప్రభుత్వాలు కలిసి రూ.10 లక్షల కోట్లు అప్పు చేశాయని ఆదిలాబాద్‌లో జరిగిన సర్పంచ్‌ల ఆత్మీయ సమ్మేళనంలో ఆరోపించారు. దోచుకున్న ఆస్తులు కాపాడుకోవడానికి KCR కుటుంబం రోడ్డెక్కిందన్నారు. రేవంత్ పాలనలో రాష్ట్రం మరింత ఆగమైందని విమర్శించారు.

Similar News

News January 7, 2026

మేడారం జాతరకు కేసీఆర్‌ను ఆహ్వానించనున్న ప్రభుత్వం!

image

TG: మేడారం మహా జాతరకు రావాలంటూ మాజీ సీఎం కేసీఆర్‌ను ప్రభుత్వం ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. మంత్రి సీతక్క ఇవాళ ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌కు వెళ్లి ఆయనకు ఆహ్వానపత్రిక అందజేయనున్నట్లు సమాచారం. అటు జాతరకు అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రావాలని సీతక్క కోరారు. నిన్న అసెంబ్లీ వద్ద వారికి ఇన్విటేషన్లు ఇచ్చారు. కాగా ఈ నెల 28 నుంచి మేడారం జాతర ప్రారంభం కానుంది.

News January 7, 2026

రేపట్నుంచి ‘ఆవకాయ-అమరావతి’ ఉత్సవాలు

image

AP: ‘ఆవకాయ-అమరావతి’ పేరుతో మరో ఉత్సవానికి విజయవాడ సిద్ధమవుతోంది. కృష్ణా నది ఒడ్డున పున్నమి ఘాట్, భవానీ ఐలాండ్‌లో రేపట్నుంచి 3 రోజుల పాటు ఉత్సవాలు జరగనున్నాయి. రాష్ట్ర పర్యాటక శాఖ, టీమ్ వర్క్స్ ఆర్ట్స్ సంయుక్త ఆధ్వర్యంలో తెలుగు సినిమా, సాహిత్యం, కళలను చాటిచెప్పేలా పలు కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 8వ తేదీ రాత్రి పున్నమి ఘాట్ వద్ద జరిగే ప్రారంభోత్సవంలో CM CBN, Dy.CM పవన్ పాల్గొననున్నారు.

News January 7, 2026

మొక్కజొన్న పొత్తులకు ప్లాస్టిక్ బాటిళ్లు ఎందుకు?

image

ఆర్గానిక్ పద్ధతిలో మొక్కజొన్నను సాగు చేసే కొందరు రైతులు పొత్తులు వచ్చాక వాటిపై ఉన్న పీచును కత్తిరించి పై ఫొటోలో చూపినట్లుగా ప్లాస్టిక్ బాటిళ్లను ఉంచుతారు. దీని వల్ల పురుగులు, బాక్టీరియా మొక్కజొన్న లోపలికి వెళ్లలేవు. అలాగే వర్షపు నీరు కూడా పొత్తులోకి వెళ్లకుండా కవచంలా పనిచేస్తుంది. ఫలితంగా ఈ పొత్తులు తాజాగా, ఎక్కడా కుళ్లకుండా, గింజ గట్టిబడి ఆకర్షనీయంగా ఉండి మంచి ధర వస్తుందనేది రైతుల అభిప్రాయం.