News December 26, 2025
పింఛన్ లబ్ధిదారులకు కలెక్టర్ గుడ్ న్యూస్!

నూతన సంవత్సరం సందర్భంగా డిసెంబర్ 31నే పింఛన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. శుక్రవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేస్తూ.. ఒకరోజు ముందుగానే నగదు పంపిణీకి అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. లబ్ధిదారులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, నిర్దేశించిన సమయానికి పింఛన్ అందజేయాలని స్పష్టం చేశారు.
Similar News
News December 27, 2025
గుర్తింపు ఉన్న పాఠశాలల్లోనే పిల్లలను చేర్పించండి: డీఈఓ

ప్రభుత్వ గుర్తింపు ఉన్న పాఠశాలల్లోనే విద్యార్థులను చేర్పించాలని డీఈఓ కంది వాసుదేవరావు శనివారం తల్లిదండ్రులకు సూచించారు. కొన్ని ప్రైవేటు సంస్థలు ప్రాథమిక తరగతులకు మాత్రమే గుర్తింపు ఉండి, ఉన్నత తరగతులు నిర్వహిస్తున్నట్లు గుర్తించామన్నారు. గుర్తింపు లేని తరగతుల్లో చదివితే పైచదువులకు అవకాశం ఉండదని హెచ్చరించారు. విద్యాసంస్థల గుర్తింపును పరిశీలించిన తర్వాతే ప్రవేశాలు కల్పించాలని ఆయన స్పష్టం చేశారు.
News December 27, 2025
రాజమండ్రి: 73 ఏళ్ల వయసు.. @ 73 డిగ్రీలు

ప్రముఖ వైద్యులు డాక్టర్ కర్రి రామారెడ్డి 73 ఏళ్ల వయసులో 73 డిగ్రీలు సాధించి అరుదైన రికార్డు సృష్టించారు. ఈ సందర్భంగా రాజమండ్రిలో సుహృన్మండలి ఆధ్వర్యంలో శుక్రవారం ఆయనకు ‘విద్యాభూషణ’ బిరుదుతో సత్కారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. రామారెడ్డి బహుముఖ ప్రజ్ఞాశాలి అని, నిరంతర విద్యార్థిగా ఆయన యువతకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు.