News December 26, 2025

ప్రత్యేక PGRSలో అర్జీలను స్వీకరించిన కలెక్టర్

image

జిల్లా అభివృద్ధికి అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని బాపట్ల కలెక్టర్ డా.వి.వినోద్ కుమార్ తెలిపారు. కలెక్టరేట్‌లో శుక్రవారం నిర్వహించిన ఎస్టీలు, దివ్యాంగుల ప్రత్యేక PGRS కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఎస్టీలు, దివ్యాంగుల నుంచి ఆయన అర్జీలు స్వీకరించారు. వాటికి వెంటనే కలెక్టర్ పరిష్కార మార్గం చూపినట్లు వివరించారు.

Similar News

News December 27, 2025

చిత్తూరు: రోడ్డు ప్రమాదంలో తల్లి, కుమారుడి మృతి

image

ఈ విషాద ఘటన చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలంలో జరిగింది. తిరుపతి-బెంగళూరు హైవేపై వెళ్తున్న కారు కె.పట్నం బ్రిడ్జి వద్ద గురువారం సాయంత్రం లారీని ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నించింది. ఈక్రమంలో అదుపు తప్పి లారీని వెనుక వైపు నుంచి కారు ఢీకొట్టింది. కారులో ఉన్న కోమల(40), ఆమె కుమారుడు వర్ధన్ గౌడ్(11) తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రికి తరలించగా చనిపోయారు. మృతదేహాలను శుక్రవారం బంధువులకు అప్పగించారు.

News December 27, 2025

RUB సాధ్యపడదు: MP పెమ్మసాని

image

గుంటూరు శంకర్ విలాస్‌లో ROB మాత్రమే నిర్మిస్తున్నామని RUB సాధ్యపడదని MP పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా పనులు చేస్తున్నామని చెప్పారు. ముందుగా అనుకున్నట్లే DDR బాండ్లు, ROB నిర్మాణానికి ఖర్చు మొత్తం రూ.150 కోట్ల ఖర్చవుతుందని తెలిపారు. కొందరు కోరుకుంటున్నట్లు ఆర్యూబీ నిర్మాణం చేపడితే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారు.

News December 27, 2025

భీమేశ్వర ఆలయంలో కోడె మొక్కు చెల్లించుకున్న 5,282 మంది భక్తులు

image

వేములవాడ భీమేశ్వరాలయంలో శుక్రవారం నాడు 5,282 మంది భక్తులు కోడె మొక్కులు చెల్లించుకున్నారు. మేడారం సమ్మక్క సారక్క జాతర నేపథ్యంలో వేములవాడకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తుండగా, 4,045 మంది శీఘ్ర దర్శనం, 1,244 మంది అతి శీఘ్ర దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకున్నట్టు తెలిపారు. మొత్తం మీద శుక్రవారం నాడు సుమారు 80,000 మంది భక్తులు భీమన్నను దర్శించుకున్నారు.