News December 26, 2025
సంగారెడ్డి: JAN 10 నుంచి సెలవులు.. DEO హెచ్చరిక

సంగారెడ్డి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు జనవరి 10 నుంచి 18వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ మేరకు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. సెలవు దినాల్లో ఎలాంటి తరగతులు నిర్వహించకూడదని, నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
Similar News
News December 30, 2025
ప్రగతి పథంలో విశాఖ విమానాశ్రయం

విశాఖ విమానాశ్రయం 2025లో గణనీయమైన ప్రగతిని సాధించింది. ఈ ఏడాది జనవరి నుంచి నవంబర్ మధ్య 27 లక్షలకు పైగా ప్రయాణికుల రాకపోకలు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. మొత్తం 4,902.876 మెట్రిక్ టన్నుల దేశీయ సరకు రవాణా చేశారు. గత ఏడాదితో పోలిస్తే విమానాశ్రయ కార్యకలాపాల్లో 9.29% వృద్ధి నమోదైంది. కస్టమర్ సంతృప్తి విషయంలో దేశవ్యాప్తంగా విశాఖ విమానాశ్రయం 9వ స్థానంలో నిలిచింది.
News December 30, 2025
వరంగల్: నామినేటెడ్ పదవులపై నేతల్లో ఆశలు..!

పీఏసీఎస్, డీసీసీబీ పాలకవర్గాల రద్దుతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాజకీయ కోలాహలం నెలకొంది. ఈ నెల 19న వచ్చిన ఉత్తర్వులు ఆశావహుల్లో ఉత్సాహం నింపాయి. జిల్లాలో 99 పీఏసీఎస్‌లు ఉండగా వాటి సంఖ్య పెంచే యోచన ఉంది. డీసీసీబీ ఛైర్మన్ పదవులు ఒకటి నుంచి ఆరుకు పెరిగే అవకాశం. ఈసారి ఎన్నికల బదులు నామినేటెడ్ విధానంలో పదవులు భర్తీ చేయనుండటంతో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ పెరిగింది.
News December 30, 2025
సంగారెడ్డి జిల్లాలో యూరియా కొరత లేదు: కలెక్టర్

సంగారెడ్డి జిల్లాలో ప్రస్తుత యాసంగి (రబీ) సీజన్‌లో పంటల సాగు కోసం రైతుల అవసరాలకు సరిపడా యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ పి.ప్రావీణ్య తెలిపారు. రైతులు ఎవరూ ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని ఆమె భరోసా కల్పించారు. యూరియాకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా ఎక్కడ కూడా రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా సాఫీగా ఎరువుల పంపిణీ జరిగేలా ప్రణాళికాబద్దంగా చర్యలు తీసుకున్నామని వెల్లడించారు.


