News December 26, 2025
కోనసీమలో ఎరువుల సరఫరాపై కలెక్టర్ ఆరా!

జిల్లా రైతులకు ఎరువులు, విత్తనాలు సకాలంలో అందుబాటులో ఉంచాలని కలెక్టర్ మహేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో వ్యవసాయ శాఖపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. రైతు శ్రేయస్సే ప్రభుత్వ లక్ష్యమని, ఎరువుల సరఫరాలో ఎటువంటి జాప్యం జరగరాదని స్పష్టం చేశారు. కృత్రిమ కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Similar News
News December 28, 2025
కోటీశ్వరుడు.. ర్యాపిడో డ్రైవరయ్యాడు

కరోనా కష్టాలు ఒక కోటీశ్వరుడిని ర్యాపిడో డ్రైవర్‌గా మార్చేశాయి. ఒకప్పుడు ₹కోట్లలో వ్యాపారం చేసిన ఆయన కొవిడ్ వల్ల ఏకంగా ₹14 కోట్లు నష్టపోయారు. చేతిలో చిల్లిగవ్వ లేక ఉపాధి కోసం ర్యాపిడో నడుపుతున్నారు. Amity యూనివర్సిటీలో చదివిన అతడు ఒక ప్రయాణికుడితో తన బాధ పంచుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్న కథ నెట్టింట వైరలవుతోంది. ‘ఇప్పటికీ దేవుడిపై నమ్మకం ఉంది. ఓటమిని ఒప్పుకోను’ అంటున్న ఆయన ధైర్యం కదిలిస్తోంది.
News December 28, 2025
పాలమూరులో ‘సైబర్’ కలకలం.. పెరుగుతున్న కేసులు

సాంకేతికత ముసుగులో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఉమ్మడి పాలమూరులోని MBNR, NRPT, GDWL, NGKL, WNP పరధిలో 2025 ఏడాదిలో 3625 ఫిర్యాదులు రాగా, 454 కేసులు ఫైల్ అయ్యాయి. గతేడాది 3,003 ఫిర్యాదులు రాగా 236 కేసులు నమోదయ్యాయి. మహబూబ్‌నగర్‌లో అత్యధికంగా 1475 ఫిర్యాదులు రాగా 220 కేసులు నమోదయ్యాయి. నారాయణపేటలో అత్యల్పంగా 318 ఫిర్యాదులు రాగా 59 కేసులు నమోదయ్యాయి.
News December 28, 2025
ప్రకాశం జిల్లాకు సక్రమంగా సాగర్ జలాలు వచ్చేనా..?

ప్రకాశం జిల్లాకు నాగార్జునసాగర్ జలాల సరఫరా మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మంత్రి జలవనరుల శాఖ అధికారులను శనివారం ఆదేశించారు. తూర్పు నాయుడుపాలెం తనక్ క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. నాగార్జునసాగర్ నుంచి విడుదలవుతున్న జలాలు తగిన స్థాయిలో జిల్లాకు రాకపోవటానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. 57 TMCలు సాగర్ జలాలు రావాల్సి ఉండగా ఇప్పటివరకు 34 TMCలు వచ్చాయన్నారు.


