News April 24, 2024
నెల్లూరు: నలుగురు అభ్యర్థుల మార్పు

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కొత్తగా ఇద్దరు అభ్యర్థుల పేర్లతో పాటు నలుగురు అభ్యర్థులను మారుస్తూ కాంగ్రెస్ అధిష్ఠానం ఉత్తర్వులు ఇచ్చింది.
☞ కావలి: పొదలకూరి కల్యాణ్
☞ వెంకటగిరి: శ్రీనివాసులు
☞ కోవూరు: కిరణ్ కుమార్ రెడ్డి(మోహన్)
☞ సర్వేపల్లి: PV శ్రీకాంత్ రెడ్డి(పూల చంద్రశేఖర్)
☞ గూడూరు: డాక్టర్ రామకృష్ణారావు(వేమయ్య)
☞ సూళ్లూరుపేట: చందనమూడి శివ(తిలక్ బాబు)
NOTE: బ్రాకెట్‌లో ఉన్న పేర్లు పాత అభ్యర్థులవి.
Similar News
News March 19, 2026
నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి విడుదల కానున్న మాజీ MLA

నెల్లూరు సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న మాచర్ల మాజీ MLA పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విడుదల కానున్నారు. TDP నేతల జంట హత్యల కేసులో పిన్నెల్లితో పాటు ఆయన సోదరుడు 98 రోజుల నుంచి జైలులో ఉన్నారు. గురజాల కోర్టు బెయిల్ ఇవ్వడంతోఆయన ఇవాళ విడుదల కానున్నారు. ఇప్పటికే బెయిల్ పేపర్స్‌ను జైలు అధికారులకు అందజేశారు.
News March 19, 2026
ఎండలు.. నెల్లూరు కలెక్టర్ కీలక ఆదేశాలు

నెల్లూరు జిల్లాలో ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు వడదెబ్బకు గురికాకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా అధికారులను ఆదేశించారు. ప్రధాన కూడళ్లలో చలివేంద్రాలు, పాఠశాలల్లో వాటర్ బెల్, ఉపాధి పనుల సమయం తగ్గింపుతో పాటు ఆసుపత్రుల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని చెప్పారు. స్వచ్ఛంద సంస్థల సహకారంతో మజ్జిగ పంపిణీ చేయాలని సూచించారు.
News March 18, 2026
నెల్లూరు: పాల కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు

నెల్లూరు జిల్లాలో లీగల్ మెట్రాలజీ, ఫుడ్ సేఫ్టీ అధికారులు బుధవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ శ్రీప్రణతి ఫ్లోరా ఆధ్వర్యంలో నెల్లూరు పరిధిలోని 2 పాల కేంద్రాలపై దాడులు చేశారు. పాల నమూనాలను సేకరించారు. విడవలూరు మండల పరిధిలోని పాల కేంద్రాలను ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ డి.నీరజ, లీగల్ మెట్రాలజీ అధికారులు తనిఖీ చేశారు. నిర్వాహకులకు పలు సూచనలు చేశారు.


