News December 26, 2025
గుంటూరు మిర్చి యార్డ్ ఛైర్మన్ ఎవరంటే..?

ఎట్టకేలకు గుంటూరు మిర్చి యార్డ్ ఛైర్మన్ పదవిని ప్రభుత్వం శుక్రవారం భర్తీ చేసింది. టీడీపీకి చెందిన కుర్రా అప్పారావును ఛైర్మన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆసియాలోనే అతి పెద్దదైన మిర్చి యార్డ్ ఛైర్మన్ పదవి రెండేళ్లుగా ఖాళీగా ఉంది. ఈ పోస్ట్‌కు చాలామంది ఆశావహులు పోటీపడ్డారు. అధిష్ఠానం కుర్రా అప్పారావును నియమించడంతో టీడీపీ నాయకులు సంతోషం వ్యక్తం చేశారు.
Similar News
News December 31, 2025
చీని, నిమ్మ తోటల్లో ఎగిరే పేను నియంత్రణ ఎలా?

చీని, నిమ్మ తోటల్లో ఎగిరే పేనును నియంత్రించేందుకు లీటరు నీటికి వేపనూనె 10,000 P.P.M 3ml కలిపి పిచికారీ చేయాలి. ఇది పిచికారీ చేసిన 7 రోజుల తర్వాత లీటరు నీటికి ఇమిడాక్లోప్రిడ్ 17.8 S.L 0.6ml లేదా నోవల్యూరాన్ 10 E.C. 0.4 ml లేదా థయోమిథాక్సామ్ 25 W.G 0.3గ్రా కలిపి 7 నుంచి 10 రోజుల వ్యవధిలో పురుగు ఉద్ధృతిని బట్టి మందును మార్చి పిచికారీ చేయాలి. మొక్కలు పూతపై ఉంటే థయోమిథాక్సామ్ పిచికారీ చేయకూడదు.
News December 31, 2025
ఆసిఫాబాద్ ఎక్సైజ్ అధికారుల సూచన

డిసెంబర్ 31 సంబరాల్లో మద్యం తాగి ప్రజలకు ఇబ్బంది కలిగించే వారిపై ఉక్కుపాదం మోపుతామని ఎక్సైజ్ సూపరింటెండెంట్ జ్యోతి కిరణ్ తెలిపారు. న్యూ ఇయర్ వేడుకలపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు పేర్కొన్నారు. ఈవెంట్స్ నిర్వహించే వారు ఎక్సైజ్ శాఖ అనుమతి పత్రం పొందాలని, అనుమతి లేని చోట మద్యం సరఫరా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మద్యం విక్రయాల సమయాన్ని అర్ధరాత్రి 12 గంటల వరకు పొడిగించినట్లు వివరించారు.
News December 31, 2025
సంగారెడ్డి: కొత్త సంవత్సరం వేళ లింక్స్ ఓపెన్ చేయొద్దు

కొత్త సంవత్సరం పురస్కరించుకొని అపరిచిత వ్యక్తుల నుంచి ఫోన్‌లకు వచ్చే లింక్‌లను ఓపెన్ చేయొద్దని ఎస్పీ పరితోష్ పంకజ్ సూచించారు. వాట్సప్ గ్రూపుల్లో వచ్చే న్యూ ఇయర్ లింకులపై అప్రమత్తంగా ఉండాలన్నారు. కలర్ ఫల్ గ్రీటింగ్స్ అంటూ మార్వెల్ లింక్స్ పంపిస్తారని చెప్పారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని.. సైబర్ నేరానికి గురైతే 1930 నంబర్‌కి ఫోన్ చేయాలన్నారు.


