News December 26, 2025
కాకినాడలో బోటు ర్యాలీ.. పిఠాపురంలో సంక్రాంతి సంబరాలు!

వచ్చే ఏడాది జనవరిలో పిఠాపురంలో సంక్రాంతి సంబరాలు, కాకినాడ జగన్నాధపురం వద్ద ఘనంగా బోటు ర్యాలీ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ షామ్మోహన్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమన్వయ సమావేశంలో పర్యాటక శాఖ అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ వేడుకల బాధ్యతను టూరిజం శాఖ తీసుకోవాలని సూచించారు. త్వరలోనే ఈ కార్యక్రమాలకు సంబంధించిన తేదీలను అధికారికంగా ప్రకటిస్తామని పేర్కొన్నారు.
Similar News
News December 31, 2025
నెల్లూరు: సాగులో సమస్యలా.. ఈ నంబర్లకు కాల్ చేయండి

జిల్లాలో సాగు సమస్యలు వస్తే ఎవరిని సంప్రదించాలి.. ఏ మందులు వాడాలి.. సస్యరక్షణ చర్యలు ఏంటి.. ఎరువులు ఏ మొతాదులో వేయాలి.. వంటి సమస్యలకు వ్యవసాయశాఖ కొన్ని ఫోన్ నంబర్లను అందుబాటులోకి తీసుకోచ్చింది.
-వరి, పప్పు ధాన్యాలు, నూనె గింజలు : 0861-2327803, 9490327424
-వేరుశనగ : 9440566582
-ఉద్యాన, వ్యవసాయ పంటలు(తెగుళ్లు : 0861-2349356, 9490004254
– ఉద్యానపంటలు: 7995088181 (ఉద్యాన శాఖ )
News December 31, 2025
తిరుపతి ఆకాశవాణి కేంద్రంలో ఉద్యోగాలు

ఆకాశవాణి తిరుపతి కేంద్రంలో తాత్కాలిక అనౌన్సర్లుగా పనిచేయడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. కనీసం ఏదైనా డిగ్రీతోపాటు స్వర మాధుర్యం, ఉచ్చారణలో స్పష్టత, కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి 21-50 ఏళ్ల మధ్య వారు అర్హులు. రాత పరీక్ష, స్వర పరీక్ష, మౌఖిక పరీక్షల ద్వారా ఎంపిక జరుగుతుంది. అభ్యర్థులు తమ దరఖాస్తులను జనవరి 15వ తేదీలోగా ఆకాశవాణి స్టేషన్ డైరెక్టర్, ఎయిర్ బైపాస్ రోడ్డు, తిరుపతి చిరునామాకు పంపించాలి.
News December 31, 2025
సాయిద సిబ్బందికి క్రమశిక్షణ తప్పనిసరి: ఎస్పీ అఖిల్ మహాజన్

సాయుధ పోలీసు సిబ్బంది క్రమశిక్షణతో పాటు నిజాయితీని కలిగి ఉండాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా బుధవారం ఆయన జిల్లా పోలీసు సాయుధ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. సిబ్బంది గౌరవ వందనాన్ని స్వీకరించి, వారి పనితీరును అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది కిట్లను, కార్యాలయ రికార్డులను పరిశీలించి, వాటిని ఎప్పటికప్పుడు నవీకరించాలని ఆదేశించారు. విధుల్లో అప్రమత్తంగా ఉండాలన్నారు.


