News December 26, 2025
భద్రాద్రి జిల్లాలో చైనా మాంజాలపై నిఘా అవసరం

సంక్రాంతి సమీపిస్తున్న తరుణంలో మార్కెట్లలో చైనా మాంజాల విక్రయాలపై పోలీసులు, అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. నిషేధం ఉన్నప్పటికీ కొంతమంది వ్యాపారులు గుట్టుచప్పుడు కాకుండా వీటిని విక్రయిస్తున్నారని చెబుతున్నారు. గతంలో కొత్తగూడెంలో ఈ మాంజాల వల్ల పలువురు వాహనదారులు, పక్షులు తీవ్ర గాయాలపాలైన ఘటనలను గుర్తు చేస్తున్నారు. పండుగ వేళ తనిఖీలు చేసి మాంజాలను సీజ్ చేయాలని కోరారు.
Similar News
News December 29, 2025
NLG: యూరియా పంపిణీలో పారదర్శకత ఉండాలి: కలెక్టర్

రైతులకు యూరియా పంపిణీ ప్రక్రియలో ఎటువంటి లోపాలు లేకుండా నిరంతర నిఘా ఉంచాలని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠీ వ్యవసాయ అధికారులను ఆదేశించారు. సాగు పనుల దృష్ట్యా ఎరువుల పంపిణీ వద్ద వివాదాలు చోటుచేసుకోకుండా మండల ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని సూచించారు. పత్తి కొనుగోలు కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన యాప్‌లో తలెత్తే సాంకేతిక సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు.
News December 29, 2025
NRPT: జిల్లాలో యూరియా కొరత లేదు: కలెక్టర్

నారాయణపేట జిల్లాలో యూరియా కొరత లేదని, రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని సరఫరా కొనసాగుతోందని ఇంచార్జ్ కలెక్టర్ ప్రతీక్ జైన్ సోమవారం ప్రకటనలో చెప్పారు. జిల్లాలో రైతులకు ఇప్పటి వరకు 3000 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేశామని, వివిధ పంపిణీ కేంద్రాల్లో 1009 మెట్రిక్ టన్నులు, మార్క్ ఫెడ్‌లో 2885 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని పేర్కొన్నారు. యూరియా సరఫరా సజావుగా జరుగుతున్నదని చెప్పారు.
News December 29, 2025
వైజాగ్‌లో న్యూ ఇయర్ వేడుకలు.. కఠిన రూల్స్!

విశాఖలో న్యూఇయర్ వేడుకల కోసం పోలీస్ కమిషనర్ కఠిన మార్గదర్శకాలు విడుదల చేశారు. ఈవెంట్లకు ముందస్తు అనుమతి తప్పనిసరి అని.. పబ్స్, హోటళ్లలో CCTV కెమెరాలు, భద్రత ఉండాలని పేర్కొన్నారు. డ్రగ్స్, అశ్లీలతకు తావులేకుండా వేడుకలు జరుపుకోవాలని చెప్పారు. మహిళల రక్షణ కోసం ‘శక్తి టీమ్స్’ అందుబాటులో ఉంటాయని.. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పట్టుబడితే రూ.10,000 జరిమానా లేదా 6 నెలల జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించారు.


