News December 26, 2025

సూర్యాపేట: జీవో 252కు వ్యతిరేకంగా జర్నలిస్టుల గర్జన

image

జర్నలిస్టుల హక్కులను కాలరాసేలా ఉన్న జీవో 252ను సవరించాలని డిమాండ్ చేస్తూ శనివారం కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టనున్నట్లు TUWJ (H-143) ప్రకటించింది. అక్రిడేషన్లు కుదింపు, డెస్క్ జర్నలిస్టులకు అన్యాయం చేసేలా ఉన్న నిబంధనలపై యూనియన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ జీవోపై స్పష్టత లేక జర్నలిస్టులు అయోమయానికి గురవుతున్నారని మండిపడింది. ఈ నిరసనలో జర్నలిస్టులందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చింది.

Similar News

News January 2, 2026

IPL: గ్రీన్ కంటే పతిరణకే ఎక్కువ డబ్బులు

image

IPL మినీ ఆక్షన్‌లో గ్రీన్ (₹25.20Cr), పతిరణ (₹18Cr) అత్యధిక ధర పలికిన టాప్-2 ఆటగాళ్లుగా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే గ్రీన్ కంటే పతిరణకే ఎక్కువ డబ్బులు రానున్నాయి. ఓవర్సీస్ ప్లేయర్ల ఫీజు విషయంలో <<18572248>>BCCI పెట్టిన లిమిట్<<>> వల్ల గ్రీన్‌కు ₹18Cr మాత్రమే దక్కుతాయి. అందులో IND+AUS ట్యాక్సులు పోగా ఆయనకు మిగిలేది ₹9.9కోట్లే. అటు SL బౌలర్ పతిరణకు ట్యాక్సులు తీసేయగా ₹12.9 కోట్లు మిగులుతాయి.

News January 2, 2026

జగిత్యాల: రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం: ఎస్పీ

image

జనవరి 1 నుంచి 31 వరకు జాతీయ రోడ్డు భద్రత అవగాహన మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో రోడ్డు భద్రత పోస్టర్లను ఆవిష్కరించారు. రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు జిల్లావ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు, చౌరస్తాలు, బస్టాండ్‌లలో కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు.

News January 2, 2026

శబరిమల బంగారం చోరీ.. CBI దర్యాప్తు అవసరం లేదు: కేరళ CM

image

శబరిమల బంగారం చోరీ కేసులో CBI దర్యాప్తు డిమాండ్లను కేరళ CM విజయన్ తోసిపుచ్చారు. SIT దర్యాప్తు సంతృప్తికరంగా జరుగుతోందన్నారు. సాక్ష్యాల ఆధారంగా ఎవరినైనా విచారణకు పిలవచ్చన్నారు. ఈ కేసులో అరెస్టై జైలులో ఉన్న ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్ పొట్టి, మరో జ్యువెలర్, కాంగ్రెస్ ఎంపీలు అదూర్ ప్రకాశ్, ఆంటోని కట్టుదిట్టమైన భద్రతలో ఉండే కాంగ్రెస్ అగ్రనేత సోనియాతో సన్నిహితంగా ఉండటంపై అనుమానం వ్యక్తం చేశారు.