News December 26, 2025
సూర్యాపేట: ఎస్పీ పేరుతో నకిలీ ఫేస్‌బుక్ ఖాతాలు

సూర్యాపేట ఎస్పీ కె.నరసింహ పేరుతో సైబర్ నేరగాళ్లు నకిలీ ఫేస్‌బుక్ ఖాతాలు సృష్టించి మోసాలకు తెరలేపారు. ‘కె.నరసింహ IPS’ పేరుతో అకౌంట్లు తెరిచి, తక్కువ ధరకే ఫర్నిచర్ ఇప్పిస్తామంటూ కొందరికి సందేశాలు పంపారు. ఈ విషయం గమనించిన ఎస్పీ ప్రజలను అప్రమత్తం చేశారు. తన పేరుతో వచ్చే అనుమానాస్పద మెసేజ్‌లకు ఎవరూ స్పందించవద్దన్నారు. డబ్బులు పంపి మోసపోవద్దని సూచించారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.
Similar News
News December 31, 2025
ఆదిలాబాద్: బాలుడి కిడ్నాప్

ADBలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థి కిడ్నాప్‌కు గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీఐ సునీల్ ప్రకారం.. NRML జిల్లాకు చెందిన మాణిక్ రావు కొడుకు ADBలోని శ్రీరాంరెడ్డిలో చదువుతున్నాడు. ఈనెల 20న గుర్తుతెలియని వ్యక్తి బాబాయ్‌నని చెప్పి తీసుకెళ్లి, MHలోని వదోలిలో వదిలిపెట్టాడు. పాఠశాల నుంచి వెళ్లే సమయంలో అవుట్‌పాస్ వివరాలు నమోదు చేయకపోవడంపై తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.
News December 31, 2025
GNT: పోటాపోటీగా నేతల పర్యటనలు.. క్యాడర్ అయోమయం.!

తాడికొండ నియోజకవర్గంలో మాజీ హోంమంత్రి సుచరిత, ప్రస్తుత ఇన్‌ఛార్జ్ డైమండ్ బాబు పోటాపోటీ పర్యటనలు చేస్తున్నారు. ఏడాదికి పైగా రాజకీయాలకు దూరంగా ఉన్న సుచరిత తాజాగా నియోజకవర్గంలో వరుస పర్యటనలతో తాడికొండ YCP రాజకీయం కాస్త ఆసక్తిగా మారి.. గ్రూపు రాజకీయాలు మరింత బలపడ్డాయి. క్షేత్రస్థాయి క్యాడర్ ఎటువైపు ఉండాలో తెలియక అయోమయంలో పడుతున్నారు. చివరికి ఇద్దరూ కాకుండా వేరొక వ్యక్తి వస్తారనే టాక్ కూడా నడుస్తోంది.
News December 31, 2025
కామారెడ్డి: సౌత్ ఇండియా బెస్ట్ పీడీగా సంధ్య

మాచారెడ్డి మండలం సోమవారంపేట ZPHSలో ఫిజికల్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న సంధ్య ఘనత సాధించారు. సావిత్రిబాయి ఫులే జయంతిని పురస్కరించుకొని దక్షిణ భారతదేశంలో ఆమె ఉత్తమ ఫిజికల్ డైరెక్టర్‌గా ఎంపికైనట్లు హెచ్ఎం భాస్కర్ తెలిపారు. జనవరి 3న విజయవాడలో జరిగే కార్యక్రమంలో ఆమెకు అవార్డును అందజేయనున్నారు. సంధ్యను కుటుంబ సభ్యులతోపాటు విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయ సిబ్బంది అభినందించారు.


