News December 26, 2025
రెవెన్యూ అసోసియేషన్ అన్నమయ్య జిల్లా ప్రెసిడెంట్‌గా నాగభూషణం

అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ యూనిట్ రెవెన్యూ అసోసియేషన్ 2025-2028 ఎన్నికలు కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు. అడ్మినిస్ట్రేటివ్ అధికారి నాగభూషణం ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. అసోసియేట్ ప్రెసిడెంట్‌గా శ్రావణి, సెక్రటరీగా వంశీకృష్ణ ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గానికి కలెక్టర్ నిశాంత్ కుమార్, జేసీ ఆదర్శ రాజేంద్రన్, డీఆర్వో మధుసూదనరావు శుభాకాంక్షలు తెలిపారు.
Similar News
News January 2, 2026
INC, BRS హోరాహోరీ ‘ప్రిపేర్’ అయ్యాయి కానీ…

CM హోదాలో గతంలో KCR కృష్ణా జలాలపై చర్చ పెడితే ‘ప్రిపేర్’ కాలేదని అప్పటి విపక్ష నేత ఉత్తమ్ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీనిపై కేసీఆర్ సెటైర్లూ వేశారు. మళ్లీ ఇదే అంశం ఇప్పుడు చిచ్చు రేపగా INC, BRS హోరాహోరీ ప్రిపేరయ్యాయి. మంత్రి ఉత్తమ్ వారం నుంచీ ఇదే పనిలో ఉన్నారని CM చెప్పారు. తీరా అసెంబ్లీ ఆరంభం కాగా KCR రాలేదు. శాసనసభలో చర్చా లేదు. చివరకు ఇరుపార్టీల ప్రిపరేషన్ మొత్తం వృథా అయింది.
News January 2, 2026
గణేష్‌పాడు: సరిహద్దులో తెలంగాణ ప్రైవేట్ స్కూల్ బస్సు బోల్తా

ఆంధ్రా శివారు గణేష్‌పాడు సమీపంలో స్కూల్ బస్ బోల్తా పడింది. మొద్దులగూడెం వివేకానంద విద్యా నిలయంకు చెందిన బస్సులో ప్రమాద సమయంలో 120కి పైగా విద్యార్థులు ఉన్నారు. బస్సు పూర్తిగా పల్టీ కొట్టడంతో పలువురు విద్యార్థులకు తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం తిరువూరులోని పలు ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు. డ్రైవర్ మద్యం సేవించి వాహనం నడపడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
News January 2, 2026
వెంకటాచలంలో దారుణం.. కొడుకుని హత్య చేసిన తండ్రి

నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం, కంటేపల్లిలో దారుణం చోటుచేసుకుంది. తండ్రి రమణయ్య తన కొడుకు రఘురామయ్యను కత్తితో పొడిచి హత్య చేశాడు. గుట్టు చప్పుడు కాకుండా దహన సంస్కారాలు చేసేందుకు తీసుకెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వ హాస్పిటల్‌కి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


